కొరటాలతో చేస్తున్న సినిమాకి టైం ఫిక్స్ చేసిన మెగాస్టార్ చిరంజీవి..?
రెండు తెలుగు రాష్ట్రాలలో కళ్ళు చెదిరే విధంగా ముఖ్యంగా నైజాంలో తన మార్కెట్ ఏంటో ఈ సినిమా కలెక్షన్ల ద్వారా నిరూపించారు చిరంజీవి. అయితే సైరా సినిమా కి దాదాపు రెండు సంవత్సరాలపాటు టైం కేటాయించడంతో తన నెక్స్ట్ సినిమా కొరటాల శివ తో చేయబోయే సినిమా కోసం చిరంజీవి టైం ఫిక్స్ చేసినట్లు ఫిలింనగర్ లో వార్తలు వస్తున్నాయి. దసరా పండుగ సందర్భంగా కొరటాలతో చేయబోయే సినిమా పూజా కార్యక్రమాలు మొదలుపెట్టిన సినిమా యూనిట్...డిసెంబర్ నుండి రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేయాలని భావించడం జరిగింది.
దీంతో ఈ సినిమా కోసం బరువు తగ్గే పనిలో చిరంజీవి ఉండటంతో..ఇటీవల కొరటాల చిరంజీవిని చూసి ఇంకా బరువు తగ్గాలని సూచించడంతో జనవరిలో ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ చేసి కేవలం నాలుగు నెలల్లోనే సినిమా కంప్లీట్ చేయాలని చిరంజీవి ఆలోచిస్తున్నట్లు వచ్చే వేసవి కల్లా మెగా అభిమానులకు ఈ సినిమా అందించాలని భావిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం చిరంజీవి ఈ సినిమా షూటింగ్ కోసం బరువు తగ్గే పనిలో జిమ్ లో బాగా వర్క్ అవుట్ లు స్పెషల్ ట్రైనర్ ఆధ్వర్యంలో చేస్తున్నారు. ఈ సినిమాలో చిరంజీవి డబుల్ రోల్ పాత్రలో నటిస్తున్నట్టు సమాచారం.