టాలీవుడ్లో చిత్ర విచిత్రాలు చాలానే జరుగుతున్నాయి. ఒకపుడు బ్యూటీ అంటే అర్ధమే వేరుగా ఉండేది. పదహారు ప్రాయంతో ముద్దబంతి పువ్వులా నవ్వులు చిందించిందే హీరోయిన్ అనేవారు. హీరో అరవయ్యేళ్ళు ఉన్నా హీరోయిన్ మాత్రం పదహారే. అన్న ఎన్టీయార్ పక్కన శ్రీదేవి వేటగాడు చేసినపుడు ఆమె వయసు పదహారే. తరువాత రోజుల్లో హీరోయిన్ రాధ కూడా పదహారేళ్ళ వయసులోనే ఎన్టీయార్ తో జత కట్టింది.
ఇపుడు పరిస్థితి మారింది. ముప్ప్పయేళ్ళు వచ్చినా నాటౌట్ అంటున్నారు. ఎక్కడా తగ్గడమేలేదు. ఆ మాటలు వస్తే పదహారు పడుచు భామలు ఇపుడు ఎక్కడా కనిపించడంలేదు. హీరోయిన్లు కూడా ఉన్నత చదువులు చదివిన తరువాతనే సినీ ఫీల్డ్ కి ఎంట్రీ ఇస్తున్నారు. దాంతో కెమెరా వైపునకు వారు వచ్చేటప్పటికే ఇరవైలు దాటిపోతున్నారు. ఆ మీదట సినిమాలు చేస్తూ తన లక్కు కనుక బాగుంటే ముప్పయ్యేళ్ళు వచ్చినా కూడా క్రీజ్ లో క్రేజులో కూడా ఉంటున్నారు.
ఇపుడు ఆ విధంగా చూసుకుంటే నిన్ననే బర్త్ డే జరుపుకున్న అనుష్క వయసు 38 ఏళ్ళు, నయనతార వయసు 35 ఏళ్ళు, అలాగే కాజల్ కు 32 ఏళ్ళు దాటింది, త్రిష కూడా 35 లో ఉంది. రకుల్ ముప్పయి పడిలో పడింది. తాప్సీ, హన్సిక వంటి హీరోయిన్లు అంతా ముప్పయ్యేళ్ళు దాటిన వారే. ఇపుడు వీరే హాట్ హాట్ భామలుగా కుర్రకారుని కిర్రాకు పెడుతున్నారు. ఓ వైపు గ్లామర్ ని కాపాడుకుంటూ సత్తా చూపుతున్నా ఈ హీరొయిన్లకు ఎంత వయసు వచ్చినా ఎప్పటికీ ముప్పయ్యే అంటున్నారు. చిత్రమేంటంటే వీరంతా ఇంకా పెళ్ళి పీటలు ఎక్కకపోవడం. పైగా వీరంతా లేడీ ఓరియెంటెడ్ మూవీస్ చేస్తూ స్టార్ హీరోలతో సమానంగా సత్తా చాటుతున్నారు. సో వీళ్ళవే రోజులంటే ఆశ్చర్యం లేదుగా.