డేటింగ్ చేద్దామా పునర్నవి.. వద్దు రాహుల్ ప్లీజ్...

Narendra Nadh
బిగ్ బాస్ సీజన్ 3 ముగిసి కొన్ని రోజులవుతున్నా ఆ షో కంటెస్టెంట్ల గురించి మాత్రం ఇప్పటికీ వార్తలు వస్తూనే ఉన్నాయి. బిగ్ బాస్ టైటిల్ ని శ్రీముఖి గెలుస్తుందని చాలా మంది మొదటి నుంచి ఉహించినప్పటికీ చివర్లో మాత్రం నమ్మలేనటువంటి ట్విస్ట్ తో రాహుల్ సిప్లిగంజ్ టైటిల్ ని విన్ అయ్యాడు. ఇక ఈ నేపథ్యంలో బిగ్ బాస్ కి సంబందించిన వార్తలు విపరీతంగా వస్తున్నాయి. 


వీటిల్లో బాగా ఆసక్తికరమైన విషయమేంటంటే రాహుల్ పునర్నవి ల మధ్య రిలేషన్. బిగ్ బాస్ హౌస్ లో వీళ్ళు బాగా సన్నిహితంగా ఉండటంతో వాళ్ళ మధ్య ఏదో జరుగుతుందని పలురకాల ఊహాగానాలు వెల్లువెత్తుతున్నాయి. క్రమక్రమంగా వీళ్లిద్దరి మధ్య ఘాటైన ప్రేమ నడుస్తుందనే వార్తలు సోషల్ మీడియా లో ఊపందుకున్నాయి. 


విచ్చలవిడిగా వస్తున్న ఈ పుకార్లనింటికి గుడ్‌బై చెప్పాలనుకున్న రాహుల్ సిప్లిగంజ్ వాళ్ళ మధ్య ఎలాంటి రొమాంటిక్ సంబంధం లేదని కుండబద్దలు కొట్టి చెప్పారు. అయితే తాను మాత్రం ఆమెని డేటింగ్ చేద్దామా... పునర్నమి.. అని అడిగానని.... వద్దు ప్లీజ్.. నా జీవితంలో వేరే వ్యక్తి ఉన్నాడని అనడంతో వాళ్ళు ఇపుడు మంచి స్నేహితులయ్యారని చెప్పుకొచ్చాడు ఈ బిగ్ బాస్ విన్నర్. 


తనను గెలిపించినందుకు బిగ్ బాస్ అభిమానులకు కృతజ్ఞతలు చెప్తూ.. తాను గెలుచుకున్న 50 లక్షల ప్రైజ్ మనీతో ఓ మంచి ఫ్లాట్ కొనుకుంటానని చెప్పాడు. 100 రోజులు ఉత్కంఠభరితంగా సాగిన బిగ్ బాస్ సీజన్ 3 లో అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తి చాలా మంది సెలబ్రిటీస్ ని.. అందమైన భామలను ఓడిస్తూ టైటిల్ ని గెలుచుకున్నాడు రాహుల్. తన సంతోషాన్ని పంచుకోవడానికి ఓ గ్రాండ్ పార్టీ అరేంజ్ చేసి పునర్నవి, వరుణ్ సందేశ్, వితిక షేరు తో కలిసి రాహుల్ సిప్లిగంజ్ బాగా ఎంజాయ్ చేసాడు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: