టాలీవుడ్ లోకి జయం సినిమాతో హీరోగా పరిచయం అయిన నితిన్ తర్వాత దిల్ సినిమాతో మంచి విజయం అందుకున్నాడు. ఈ రెండు మూవీస్ హిట్ కావడంతో నితిన్ కి వరుస ఛాన్సులు వచ్చిన ఏ సినిమా పెద్దగా హిట్ కాలేదు. ఇప్పటికీ నితిన్ టాలీవుడ్ లోకి వచ్చి పదిహేను సంవత్సరాలు దాటినా చెప్పుకోదగ్గ సూపర్ హిట్ మూవీస్ లేవు. ఆ మద్య గుండెజారి గల్లంతయ్యిందే,ఇష్క్ మూవీస్ మంచి హిట్ అయ్యాయి. తర్వాత త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన అ..ఆ సినిమా మంచి విజయం అందుకుంది. గత ఏడాది శ్రీనివాస కళ్యాణం, ఛల్ మోహన్ రంగ లాంటి నిరాశాజనకమైన ఫలితాలు ఎదుర్కొన్న నితిన్ ప్రస్తుతం తాను నటిస్తున్న చిత్రాలపై దృష్టి పెట్టాడు.
కాకపోతే గెలుపు..ఓటమి అనే తేడా లేకుండా ఈ హీరో కెరీర్ బాగానే సాగుతుంది. టాలీవుడ్ లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్స్ లో నితిన్ కూడా ఉన్నాడు. తాజాగా నితిన్ ‘భీష్మ’ మూవీలో నటిస్తున్నాడు. నితిన్ సరసన కన్నడ బ్యూటీ రష్మిక మందన నటిస్తుంది. తాజాగా దీపావళి పండుగ కానుకగా నితిన్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ భీష్మ. 'సింగల్ ఫరెవర్' అనేది క్యాప్షన్. వెంకి కుడుముల దర్శకత్వంలో నితిన్ నటిస్తున్న ‘భీష్మ’మూవీ సినిమా మాస్ ఎలిమెంట్స్ మంచి ఎంట్రటైన్ మెంట్ తో రూపొందుతుందని చిత్రయూనిట్ తెలిపారు. రొమాంటిక్ గా ఉండే ఓ పోస్టర్, నితిన్ యాక్షన్ సన్నివేశాల్లో పెర్ఫామ్ చేస్తున్న మరో పోస్టర్ ని చిత్ర యూనిట్ విడుదల చేసింది.
ఈ రెండు పోస్టర్స్ లో నితిన్ లుక్ ఆకట్టుకుంటోంది. చీర కట్టులో అందంగా కనిపిస్తున్న రష్మిక వెనకాల నితిన్ పడుతున్న లుక్ ఈ చిత్రంలోని రొమాంటిక్ యాంగిల్ ని రివీల్ చేస్తోంది. ఈ మూవీ తర్వాత నితిన్ వెంకీ అట్లూరి దర్శకత్వంలో రంగ్ దే చిత్రంలో, చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో మరో మూవీ లో నటించబోతున్నాడు.