తెలుగు బుల్లితెర పాపులర్ బిగ్‌బాస్ షో 11 వారాలు కంప్లీట్ చేసుకుని 12వ వారంలోకి ఎంట్రీ ఇచ్చింది. ఇక గత వారం షో నుంచి పునర్నవి ఎలిమినేట్ అయ్యింది. పునర్నవి ఎలిమినేట్‌తో హిమజ ఎలా సంబరాలు చేసుకుందో ? చూశాం. ఇక వచ్చే వారం ఎలిమినేషన్‌కు మొత్తం హౌస్ నుంచి నలుగురు నామినేట్ అయ్యారు. వారిలో స్టార్ కపుల్ వరుణ్.. వితిక శేరు, రాహుల్ మరియు మహేష్ విట్టా ఉన్నారు.
అయితే గోల్డెన్ మెడాలియన్ టాస్క్‌లో విజేతగా నిలిచిన వితిక తన మెడాలియన్‌ను త్యాగం చేయడంతో ఒక ఎలిమినేషన్ నుండి తప్పించుకొనే అవకాశం ఉండటంతో ఆమె ఆ అవకాశం ఉపయోగించుకొని, ఎలిమినేషన్ నుండి బయటపడ్డారు. ఇక మిగిలిన ముగ్గురు సభ్యులైన వరుణ్, మహేష్, రాహుల్ లలో ఒకరు వచ్చే వారం షో నుండి బయటకు వెళ్లిపోనున్నారు.
వాస్తవంగా వితిక ఎలిమినేషన్లో ఉన్నట్లయితే ఆమె ఖచ్చితంగా ఎలిమినేట్ అయ్యే ఛాన్సులే ఎక్కువుగా ఉండేవి. ఇక ఈ వారం ఎలిమినేషన్లో ఉన్న ముగ్గురిలో చూస్తే చాలా మంది అభిప్రాయం ప్రకారం వరుణ్ ఎలిమినేట్ అయ్యే అవకాశాలు తక్కువ. వరుణ్‌కు ఉన్న హీరో క్రేజ్.. ఆ స్టార్‌డమ్‌తో సులువుగానే గట్టెక్కేయవచ్చు.
కాబట్టి ఈ ఈవారం మహేష్, రాహుల్ లలో ఒకరు ఖచ్చితంగా ఎలిమినేట్ కావచ్చు. వీరిలో పాపులారిటీ పరంగా చూస్తే రాహుల్‌కు సేఫ్ ఛాన్సులు ఉన్నాయి. పునర్నవి ఎలిమినేట్ అయ్యాక రాహుల్‌కు సింపతీ పెరుగుతోంది. ఇక రాహుల్ గతంలో వరుసగా ఎలిమినేట్ అవుతూ ప్రేక్షకుల ఓటింగ్‌తో సేఫ్ అవుతూ వచ్చాడు.
ఇది కూడా రాహుల్‌కు ఇప్పుడు బయట ఫ్యాన్ ఫాలోయింగ్ పెరగడానికి కారణమైంది. ఇక మహేష్‌కు బయట ఫ్యాన్ ఫాలోయింగ్ తక్కువే. ఈ నేపథ్యంలో మహేష్ విట్టా ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఎక్కువ. మరి ఏం జరుగుతుందో ? చూడాలి.