చరణ్ ప్లాన్స్ ను తారుమారు చేసిన ప్రభాస్ ప్రవర్తన !

Seetha Sailaja
‘సైరా’ ను అత్యంత భారీగా ఉత్తరాది రాష్ట్రాలలో ప్రమోట్ చేసే వ్యూహాలకు చరణ్ పదును పెడుతున్నాడు. చిరంజీవి బాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం అయిన వ్యక్తి అయినప్పటికీ నేటితరం బాలీవుడ్ ప్రేక్షకులకు చిరంజీవి గురించి పెద్దగా తెలియదు. 

దీనితో చిరంజీవి బాలీవుడ్ రీ ఎంట్రీని చాల గ్రాండ్ గా ఉత్తరాది ప్రేక్షకులకు పరిచయం చేయడానికి ప్రభాస్ సహాయాన్ని చరణ్ ‘సైరా’ విషయంలో కోరుకున్నాడు అన్న వార్తలు వచ్చాయి. అంతేకాదు ప్రభాస్ చిరంజీవిలతో రెండు ఇంటర్వ్యూలను ‘సైరా’ గురించి రికార్డు చేయించి ఈ మూవీ విడుదలకు ముందే కొన్ని ప్రముఖ హిందీ ఛానల్స్ లో ప్రసారం చేయించాలని చరణ్ ఆలోచనలు చేసినట్లు వార్తలు వచ్చాయి. 

అయితే ఈ ఆలోచన ఇంకా క్రియా రూపంలోకి రాకుండానే ప్రభాస్ మొన్నరాత్రి ఎవరికీ చెప్పకుండా హాలిడే ట్రిప్ కోసం యూరప్ వెళ్ళిపోవడం చరణ్ కు షాక్ ఇచ్చినట్లు సమాచారం. దీనితో చరణ్ ఒత్తిడి తప్పించుకోవడానికి ప్రభాస్ ఇలా ముందు చూపుతో వ్యవహరించాడా అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. 

అయితే ప్రభాస్ ఇంత హడావిడిగా యూరప్ వెళ్ళిపోవడానికి మరొక కారణం ఉంది అంటూ మరికొందరు విశ్లేషిస్తున్నారు. ‘సాహో’ నష్టాలు ఖరార్ కావడంతో ఈ మూవీ బయ్యర్లు ఈ సినిమా నిర్మాతల నుండి ఆర్ధిక సహాయాన్ని ఆశిస్తున్నారు. ఈ పరిస్థితులలో బయ్యర్ల నుండి ప్రభాస్ కు కూడ కృష్ణంరాజు ద్వారా ఒత్తిడి వచ్చే ఆస్కారం ఉంది. ఈ ఒత్తిడిని తప్పించుకోవడానికి ప్రభాస్ ఇలా హడావిడిగా యూరప్ ప్రయాణం పెట్టుకుని ఉంటాడు అంటూ మరి కొందరి ఊహ. కారణాలు ఏమైనప్పటికీ ప్రభాస్ కనీసం రెండు వారాలు ఎవరికీ అందుబాటులో లేకుండా యూరప్ లో ఏకాంతంగా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. దీనితో ‘సైరా’ ప్రమోషన్ లో ప్రభాస్ ను చూడాలి అని అనుకున్న మెగా అభిమానుల కొరకకు బ్రేక్.. 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: