మెగాప్రిన్స్ వరుణ్‌తేజ్ - హరీష్ శంకర్ కాంబినేషన్లో తెరకెక్కిన గద్దలకొండ గణేష్ సినిమా బాక్సాఫీస్ దగ్గర దూసుకుపోతోంది. కోలీవుడ్‌లో సిద్దార్థ్ హీరోగా తెరకెక్కి హిట్ అయిన జిగర్తండా సినిమాకు రీమేక్‌గా వచ్చిన ఈ సినిమాకు ముందుగా వాల్మీకి టైటిల్ అనుకున్నారు. ఆ తర్వాత రిలీజ్ ముందు రోజు రాత్రి వాల్మీకి టైటిల్ కాస్తా గద్దలకొండ గణేష్‌గా మారిపోయింది.
తొలి రోజు తొలి షోకే మంచి హిట్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా మూడు రోజులకు 15.77 కోట్ల షేర్ రాబట్టింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో రూ 13.36 కోట్ల షేర్ రాబట్టిన ఈ సినిమా వరల్డ్ వైడ్‌గా రూ 15.77 కోట్ల షేర్ కొల్లగొట్టింది. కేవలం మూడు రోజులకే 80 శాతం రికవరీ వచ్చేసింది. సినిమాపై నమ్మకంతో గుంటూరు, వెస్ట్ లాంటి చోట్ల చివర్లో భారీ రేట్లకు ఈ సినిమా రైట్స్ సొంతం చేసుకున్నారు.
ఇక సైరా వచ్చే వరకు అంటే అక్టోబర్ 2వ తేదీ వరకు ఈ సినిమాకు ఎదురు లేదు. మరోవైపు బందోబస్త్ అట్టర్‌ప్లాప్ అయ్యింది. అప్పటి వరకు బాక్సాఫీస్ దగ్గర గద్దలకొండ గణేష్‌దే గత్తరబిత్తర. ఫైనల్ బాక్సాఫీస్ రన్ కంప్లీట్ అయ్యే సరికి ఈ సినిమా రూ.40 కోట్ల షేర్ రాబడుతుందని అంచనా వేస్తున్నారు.
14 రీల్స్ బ్యానర్‌పై తెరకెక్కిన ఈ సినిమాలో పూజా హెగ్డే, మురళీ అధర్వ, మృణాళిని హీరోయిన్లుగా నటించారు.
గద్దలకొండ గణేష్ ఫస్ట్ వీకెండ్ షేర్ (రూ.కోట్లలో) :
నైజాం - 4.83
సీడెడ్ - 2.05
వైజాగ్ - 1.63
ఈస్ట్ - 1.07
వెస్ట్ - 0.97
కృష్ణా - 1.06
గుంటూరు - 1.23
నెల్లూరు - 0.52
-------------------------------------
ఏపీ + తెలంగాణ = 13.36 కోట్లు
-------------------------------------
రెస్టాఫ్ ఇండియా - 1.2
రెస్టాఫ్ వరల్డ్ - 1.21
-------------------------------------
వరల్డ్ వైడ్ షేర్ = 15.77 కోట్లు
-------------------------------------