బిగ్‌బాస్ హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చిన కంటెస్టెంట్స్ లో వన్ అఫ్ ద స్ట్రాంగెస్ట్ కంటెస్టెంట్‌గా పేరు తెచ్చుకున్న అలీ రెజా, గతవారం అనూహ్యంగా ఎలిమినేట్ కి గురికావడం అందరిని షాక్ కి గురిచేసింది. ఒకానొక సందర్భంలో అలీ ఎలిమినేట్ అయ్యాడు అంటే ..హౌస్‌లో ఉన్న ఏ ఒక్కరూ కూడా నమ్మడానికి సిద్ధంగాలేరు. అసలు ఆరు వారాల పాటు ఎలిమినేషన్ లోకి ఎంట్రీ ఇవ్వని అలీ రెజా , ఎలిమినేషన్స్ లోకి ఎంట్రీ ఇచ్చిన మొదటివారమే ఎలిమినేట్ అయ్యి బిగ్ బాస్ హౌస్ నుండి బయటకి వచ్చేసాడు. అలీ రెజా బిగ్ బాస్ హౌస్ ని వీడే సమయంలో దాదాపు హౌస్మేట్స్ అందరూ భావోద్వేగానికి గురయ్యారు.
ముఖ్యంగా శివజ్యోతి గురించి ఎంత తక్కువగా చెప్పుకుంటే అంత మంచిది. అలాగే శ్రీముఖి సైతం కన్నీటిపర్యంతమైంది. హౌస్ నుండి బయటకి వచ్చి నాగార్జున తో మాట్లాడుతూ ... ఇంతమంది తన కోసం ఏడుస్తున్నారు, బిగ్‌బాస్ టైటిల్ గెలవకపోయినా.. వీరందరి ప్రేమ గెలుచుకున్నాను నాకు ఇది చాలు అని అలీ తెలిపాడు.
బిగ్ బాస్ హౌస్ లో నుండి ఎలిమినేట్ అయ్యి బయటకి వచ్చిన అలికి మరో షాక్ తగిలింది. తాను బిగ్‌బాస్ హౌస్‌లో ఉన్న సమయంలో తన మామయ్య చనిపోయాడని తెలుసుకొని చాలాభాదపడ్డాడు. ఈ సంగతిని ఫ్యామిలీ మెంబర్స్ తనకు తెలియనివ్వలేదని అలీ రెజా సోషల్‌మీడియాలో ఓ భావోద్వేగమైన ఒక సందేశాన్ని పోస్ట్ చేశాడు.నా జీవితంలో విజయాన్ని చూడాలనుకున్నారు.. అయితే ఇప్పుడు నాపై ఎంతో మంది అభిమానం చూపిస్తున్నారు. ఎంతో మంది నన్ను ప్రేమిస్తున్నారు. కానీ ప్రస్తుతం మీరు అవన్నీ చూడలేకపోతున్నారు. మిమ్మల్ని చివరి క్షణంలోనైనా చూడలేకపోయాను. బిగ్‌బాస్ నాకెంత అవసరమో తల్లిదండ్రులకు తెలుసు.. అందుకే మీ గురించి నాకు తెలియనివ్వలేదు.
అయినా వారికి తెలీదు మీరు కూడా నాకు అంతే ముఖ్యమని.. బిగ్‌బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ అవ్వడమే నాకు ఓ షాక్‌లా ఉంటే.. బయటకు వచ్చాక మీరు లేరన్న వార్త మరింత షాక్‌కు గురిచేసింది. ఇంట్లో అనంతమైన బాధ ఉన్నా.. నన్ను సంతోషంగా ఉంచేందుకు ప్రయత్నిస్తున్నారు. అందరూ నాకు సపోర్ట్‌ను ఇస్తున్నారు. అన్ని వైపుల నుంచి ఇంతప్రేమను నేను చూశాకా.. నాకు ఇంకెమీ అవసరం లేదనిపిస్తోంది. మామా నువ్వు బెస్ట్. నిన్ను అంతిమ సమయంలో చూడలేక పోయినందుకు నేనెప్పుడూ బాధపడుతూనే ఉంటాను. లవ్ యూ ఫర్ ఎవర్. నీ ఆత్మకు శాంతి చేకూరాలి అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఈ విషయం అలీ కి చెప్పాలని మొదట్లో అనుకున్నారు. దానికి బిగ్ బాస్ కూడా పర్మిషన్ ఇచ్చారు. కానీ , ఒక్కసారి వచ్చి ఇక్కడి పరిస్థితి చూస్తే తిరిగి మళ్ళీ షో కి ఎట్టి పరిస్థితిలో పోలేడు అని భావించిన అలీ కుటుంబ సభ్యులు అలీ కి ఈ విషయాన్ని చెప్పలేదు.