నాగార్జున సెటైర్లతో నిర్ఘాంతపోయిన మీడియా !

Seetha Sailaja
నాగార్జున నటిస్తున్న ‘మన్మధుడు 2’ మూవీలో నాగ్ తన లిప్ లాక్ లతో రెచ్చిపోతున్న తీరుకు ఇండస్ట్రీ వర్గాలు ఆశ్చర్యపడుతున్నాయి. ఈ విషయాన్ని ఇండస్ట్రీ వర్గాలు నాగ్ ను అడగలేకపోయినా నిన్న జరిగిన ‘మన్మధుడు 2’ ట్రైలర్ లాంచ్ మీడియా మీట్ లో నాగార్జునను ఇరుకున పెట్టడానికి మీడియా ప్రయత్నిస్తే నాగ్ తన తెలివితేటలతో మీడియాను కార్నర్ చేసాడు. 

‘మన్మధుడు 2’ లో ఉన్న లిప్ లాక్ సీన్స్ పై వస్తున్న విమర్శలను ఒక మీడియా ప్రతినిధి నాగ్ దృష్టికి తీసుకు వస్తూ షష్టిపూర్తి వయసులో ఈ ముద్దుల సీన్స్ మీకు అవసరమా అంటూ నాగ్ ను ఇరుకున పెట్టడానికి ప్రయత్నించాడు. అయితే నాగ్ ఏమాత్రం తడబడకుండా తనకు వయసు పెరిగే కొద్ది తన నటనలోనే కాకుండా తన లిప్
లాక్స్ విషయాలలో కూడ పరిపక్వత పెరుగుతోంది అని ప్రేక్షకులకు తెలియడానికి ఇలా నటించాను అంటూ ఆ మీడియా ప్రతినిధి మైండ్ బ్లాంక్ చేసాడు నాగ్. 

ఇది ఇలా ఉండగా ఈమూవీలో హీరోయిన్ గా నటించిన రకుల్ ప్రీత్ కు 1కోటి 55 లక్షలు  పారితోషికం ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం రకుల్ ప్రీత్ కు అంత క్రేజ్ లేకపోయినా ఈ రేంజ్ లో ఆమెకు పారితోషికం ఇవ్వడంతో నాగ్ ఇలా రకుల్ ను లిప్ లాక్స్ తో హింసించాడా అంటూ సెటైర్లు వేస్తున్నారు.

నిన్న జరిగిన మీడియా మీట్ లో నాగార్జున మాట్లాడుతూ ‘మన్మధుడు 2’ కథకు తన సూపర్ హిట్ మూవీ ‘మన్మధుడు’  సినిమాకు సంబంధం లేదు అంటూ క్లారిటీ ఇచ్చాడు. దీనితో ఈమూవీ సీక్వెల్ కాదు అన్న సంకేతాలు వచ్చాయి. అయితే నాగ్ యంగ్ హీరోలతో సమానంగా రొమాంటిక్ గా లిప్ లాక్స్ తో సందడి చేసినా మోహంలో గ్లో తగ్గడంతో నాగ్ చేసిన ఈ చిలిపి పనులను నేటితరం ప్రేక్షకులు ఎంత వరకు ఇష్టపడతారు అన్న విషయం పై ‘మన్మధుడు 2’ సక్సస్ పై ఆధారపడి ఉంటుంది..   


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: