బిగ్ బాస్ 3 : నాగ్ ప్రశ్నకు తెలివిగా సమాధానం చెప్పాడు!
తెలుగు బుల్లితెరపై బిగ్ బాస్ 3 సీజన్ ఆరంభం అయ్యింది. నిన్న రాత్రి గ్రాండ్ గా ఈ ఈవెంట్ కనువవిందుగా సాగింది. అక్కినేని నాగార్జున బిగ్ బాస్ 3 సీజన్ ని ఎంతో ఉల్లాసంగా ఉత్సాహంగా ఆరంభించారు. వేదికపైకి రాగానే నాగార్జున గత సీజన్ హోస్ట్ లు ఎన్టీఆర్, నానిని అభినందించాడు. ఒక్కొక్కరూ ఒక్కో స్టైల్లో స్టేజ్ పైకి రావడం..తర్వాత వారిని సాదరంగా బిగ్ బాస్ 3 హౌజ్ లోకి నాగార్జున పంపించడం జరిగింది.
అయితే చివరిగా ఒక ట్విస్ట్ అని చెప్పారు నాగార్జున. దాంతో టీవీ ముందు కూర్చున్న ప్రేక్షకులు ఒక్కసారే ఏంటా ట్విస్ట్ అని ఎంతో క్యూరియాసిటీతో చూశారు. అదే సమయంలో హ్యాపీడేస్ ఫేమ్ వరుణ్ సందేష్ 'కొత్త బంగారు లోకం' మూవీలో పాటకు డాన్స్ చేస్తూ అతడి సతీమణి వితిక షెరు వేదికపైకి చేరుకున్నారు. వీరిద్దరూ చేసిన రొమాంటిక్ డాన్స్ ఆకట్టుకుంది. ఇక నాగార్జున స్టేజ్ పైకి వచ్చి వరుణ్ సందేష్ ని చాలా కాలం తర్వాత కనిపిస్తున్నావని అన్నారు. అంతే కాదు శేఖర్ కమ్ముల తీసిన హ్యాపీ డేస్ మూవీ అంటే తనకు ఎంతో ఇష్టమని అన్నారు నాగార్జున.
ఈ సందర్భంగా ఇద్దరూ ఎలా లవ్ లో పడ్డారు..ఎలా పెళ్లి చేసుకున్నారన్న విషయంపై మాట్లాడిన తర్వాత షోలో అందరూ ఎలిమినేట్ అయి మీరు ఇద్దరూ మిగిలితే ఏంటి పరిస్థితి అని నాగార్జున సరదాగా అడిగాడు. అంత కష్టపడ్డాను కనుక విన్నర్ నేనే కావాలని కోరకుంటానని వితిక అన్నారు. అయితే వరుణ్ సందేశ్ మాత్రం చాలా తెలివిగా సమాధానం చెబుతూ..తాన భార్య గెలిస్తే తన గెలుపుగా ఫీల్ అవుతానని..చివరికి తనే గెలవాలని కోరుకుంటానని అన్నారు. దాంతో నాగార్జున అబ్బో భలే సమాధానం చెప్పావే అంటూ ఇద్దరినీ బిగ్ బాస్ హౌజ్ లోకి పంపారు.