గీతాంజలి, శివ, అన్నమయ్య, నాగార్జున

Prasad
వెండి తెర మన్మధుడు గా అభిమానులు ముద్దుగా పిలుచుకునే హీరో నాగార్జున 1959, ఆగస్టు 29న జన్మించారు. చిన్న వయస్సులో సుడిగుండాలు సినిమాలో నటించారు. 1986 లో వచ్చిన విక్రమ్ సినిమాతో హీరోగా పరిచయం అయ్యారు. మొదటగా అక్కినేని నాగేశ్వరరావు కుమారుడిగా గుర్తింపు సాధించిన నాగార్జున క్రమంగా తన కంటూ ఓ ప్రత్యేకతను చాటుకున్నారు. నాడు నటన రాదంటూ విమర్శించిన వారి నోటి చేత నటన నాగార్జున రక్తంలోనే ఉందని అనిపించుకున్నాడు. ఇప్పటి వరకూ 90 కు పైగా సినిమాల్లో నటించిన నాగార్జునకు బాలీవుడ్ లోనూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన గీతాంజలి, రామ్ గోపాల్ దర్శకత్వంలో వచ్చిన శివ, కె.రాఘవేంద్రరావు రూపొందించిన అన్నమయ్య.. ఈ మూడు సినిమాలు చాలు నాగార్జున ఏ స్థాయి నటుడో చెప్పడానికి.. నాగార్జున మంచి నటుడు గానే కాదు. నిర్మాతగానూ రాణిస్తున్నారు. నాగార్జున కుమారుడు నాగచైతన్య హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. త్వరలోనే మరో కుమారుడు అఖిల్ ను కూడా హీరోగా పరిచయం చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి.   

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: