మెగాస్టార్ చిరంజీవి - స్టార్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్ లో వస్తోన్న సినిమా, ఆగస్ట్ 22న చిరు పుట్టినరోజు సందర్భంగా ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని జరుపుకోబోతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మాత్రం సెప్టెంబర్ రెండో వారం నుంచి మొదలు కానుంది. నాలుగు నెలలు క్రితమే మొదవ్వాల్సిన ఈ సినిమా, 'సైరా నర్సింహారెడ్డి' చిత్రం షూటింగ్ ఆలస్యం కావడంతో పోస్ట్ పోన్ అవుతూ వచ్చింది.
ఇక చిరు కోసం కొరటాల ఓ మంచి సోషల్ మెసేజ్ తో కూడుకున్న స్క్రిప్ట్ ను తయారు చేశారట. సామాజిక అంశాలకు కమర్షియల్ హంగులు అద్ది సినిమా తియ్యడంలో దిట్టైన శివ, చిరు కోసం డ్యుయెల్ రోల్స్ రాశారు. రైతన్నగా ఓ పాత్ర, యన్.ఆర్.ఐ గా మరో పాత్ర ఉంటుందట. మొత్తానికి సోషల్ డ్రామాతో తెరకెక్కనున్న ఈ సినిమాలో స్ట్రాంగ్ మెసేజ్ ఉండబోతుందన్నమాట.
ఈ సినిమా రిలీజ్ డేట్ ను కూడా ఫిక్స్ చేశారు. వచ్చే ఏడాది ఏప్రిల్ రెండవ వారంలో ఉగాది పండుగ సందర్భంగా ఈ సినిమాని విడుదల చేయాలని ఇప్పటికే మేకర్స్ ప్లాన్ చేశారు. ఇక ఈ చిత్రంలో సునీల్, అనసూయ కూడా ముఖ్య పాత్రల్లో నటిస్తునట్లు ఇప్పటికే సోషల్ మీడియాలో అనేక రూమర్స్ కూడా వచ్చాయి. మరి వాటిల్లో ఎంత నిజం ఉందో సినిమా స్టార్ట్ అయితే గాని తెలియదు.