ఇండ‌స్ట్రీలో ప్ర‌భాస్‌ను తొక్కే కుట్ర ... తెర‌వెన‌క పెద్దోళ్లే ఉన్నారా..

VUYYURU SUBHASH
బాహుబ‌లి సీరిస్‌ సినిమాల తర్వాత టాలీవుడ్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఒక్కసారిగా నేషనల్ హీరోగా మారిపోయాడు. ప్రస్తుతం ప్రభాస్ సినిమా వస్తోందంటే చాలు దేశవ్యాప్తంగా అనేక భాషల్లో ఎంతోమంది అభిమానులు ఈ సినిమా కోసం వెయిట్ చేసే పరిస్థితి నెలకొంది. బాహుబలి ది కంక్లూజన్ లాంటి భారీ సూపర్ బ్లాక్ బస్టర్ తర్వాత ప్రభాస్ నటిస్తున్న సినిమా సాహో ఆగస్టు 15వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున థియేటర్లలోకి వస్తోంది. ఈ సినిమాపై ఇప్పటికే నేషనల్ వైడ్‌గా భారీ అంచనాలు ఉన్నాయి. ప్రస్తుతం నేషనల్ మీడియాలో సైతం సాహో పెద్ద ట్రెండింగ్ న్యూస్‌గా మారింది. 


బాలీవుడ్ హీరోయిన్ ప్రభాస్కు జోడిగా నటిస్తోంది. రూ. 200 కోట్ల భారీ బడ్జెట్తో తెరకెక్కుతున్న ఈ సినిమాను సుజిత్ కుమార్ డైరెక్ట్ చేస్తున్నారు. తాజాగా సోష‌ల్ మీడియాలో ప్రభాస్ సాహో కథ ఇదేనంటూ ఒక లైన్ సోషల్ మీడియాలోనూ, వెబ్‌సైట్ల‌లోనూ చక్కర్లు కొడుతోంది. త‌న కుటుంబాన్ని చంపిన డాన్‌ను చంపేందుకు రివేంజ్ తీర్చుకునే క్ర‌మంలో ప్ర‌భాస్ ఓ న‌కిలీ ఇంట‌ర్‌పోల్ ఏజెంట్‌గా మారి ఆ డాన్‌ను చంపేస్తాడ‌ట‌. క్లుప్తంగా సాహో స్టోరీ ఇలాగే ఉంటుంద‌ని ఆ లైన్ వైర‌ల్ చేస్తున్నారు. 


ఈ క్ర‌మంలోనే ఈ క‌థ‌పై కొంద‌రు సెటైర్లు వేస్తున్నారు. ఇంత మాత్రం క‌థ‌కు ఇంత బ‌డ్జెట్టా... ఇది మ‌రీ ఓవ‌ర్ క‌దా అని కామెంట్లు చేస్తున్నారు. బాహుబ‌లి మార్కెట్‌ను ప్ర‌భాస్ కంటిన్యూ చేసే క్ర‌మంలోనే సాహో, జాన్ లాంటి భారీ బ‌డ్జెట్ సినిమాలు చేస్తున్నాడు. ఇది న‌చ్చ‌ని వాళ్లు ప్ర‌భాస్ భారీ మార్కెట్ కంటిన్యూ కాకుండా ఉండే క్ర‌మంలో సాహోపై వీలైన‌న్ని రూమ‌ర్లు క్రియేట్ చేయాల‌ని చూస్తున్నార‌ని.. దీని వెన‌క ఇండ‌స్ట్రీలోని కొంద‌రు పెద్ద‌లు కూడా ఉన్నార‌ని గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. 


చిన్న క‌థ‌కు ఇంత బ‌డ్జెట్టా ? అన్న టాక్ రిలీజ్‌కు ముందే బ‌య‌ట‌కు స్ప్రెడ్ చేస్తే మార్కెట్ వ‌ర్గాల్లో కూడా సాహో వీక్ అవుతుంది అన్న‌దే వారి ప్లాన్ అట‌. అందుకే ప్ర‌భాస్ మార్కెట్‌ను వ్యూహాత్మ‌కంగా డౌన్ చేసే క్ర‌మంలోనే ఇలా చేస్తున్న‌ట్టు తెలుస్తోంది. అయితే సాహో యూనిట్ మాత్రం క‌ళ్లు చెదిరే యాక్ష‌న్ సినిమా కావ‌డంతో భారీ బ‌డ్జెట్‌తో తెర‌కెక్కిస్తున్నామ‌ని.. సాహో చూసే ప్రేక్ష‌కుల‌కు వీనుల విందే అని చెపుతోంది.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: