సమైఖ్య ఉద్యమం పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన యంగ్ హీరో ..!!

K Prakesh

సామాన్యంగా మన యంగ్ హీరోలు ఆడియో వేడుకల స్టేజీల పైనా టివి షోలలోను హడావిడి చేస్తూ కనిపిస్తూ ఉంటారు. రాజకీయాల పై, రాజకీయ ఉద్యమాల పై సామాన్యంగా ఆమడ దూరంలో ఉంటారు. దీనికి విరుద్ధంగా నిన్నటి కేంద్ర కేబినెట్ తెలంగాణ నోట్ తరువాత ప్రస్తుతం మండిపోతున్న సమైఖ్యాంధ్ర ఉద్యమం పై హీరో నవదీప్ విచిత్రంగా స్పందించాడు.

అతని ట్విటర్ లో పెట్టిన అతడి మాటలు చూద్దాం ‘నేడే చూడండి మీ అభిమాన టివీ ఛానల్లో ఆంధ్రప్రదేశ్ పొలిటికల్ హైడ్రామా మీరెప్పుడు గతంలో చూడనిది విననిది ఆలసించిన ఆశాభంగం’ అంటూ ఒక టివి ఎడ్వటైజ్ మెంట్ లా హీరో నవదీప్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం ఈనాటి రాజకీయ ఉద్యమ నేపధ్యంలో అందర్నీ ఆకర్షించింది.

 పెద్దపెద్ద రాజకీయ నేపధ్యంగల కుటుంబాలనుంచి వచ్చిన యంగ్ హీరోలు నోరు మెదపకుండా రోజులు గడిపేస్తూ ఉంటే ఒక చిన్న హీరో ధైర్యంగా ఈనాటి రాజకీయనాయకులు ఆడుతన్న హైడ్రామాను విమర్శిస్తూ తన అభిప్రాయాన్ని తన ట్విటర్ లో పెట్టడం టాక్ ఆఫ్ ది టాలీవుడ్ గా మారింది....

 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: