బజార్లో బాజాలు - బయ్యర్ల గుండేల్లో బాకులు - ఇదీ "మహర్షి" తీరు...ట?

శ్రీమంతుడు అద్భుతం మహేష్ మాన్లినెస్ గ్లోరిఫై అద్భుతంగా చేశాడు కొరటాల శివ. భరత్ అను నేను కూడా అంతే కాకపోతే సమకాలీన రాజకీయాన్ని అద్భుతంగా 'హింట్' చేశారు. అదీ శివనే! రెండు సినిమాల్లో కథానాయకుడు బట్టలు నలగవు. మాన్లినెస్ చెదరదు. మొదటిది కొత్తదనం. రెండోది సమకాలీనతతో కొనసాగిన కొత్తదనం.

ఇక మూడోది "మహర్షి" అదే కోవలో వచ్చిన 'బోరింగ్ ఎక్స్-ప్రెషణ్' కనీసం అందులోని సంఘటన కలలో కూడా సాధ్యం కానిది. శ్రీమంతుడులో అన్ని పాత్రలు కథలో ఇమిడిపోయాయి (మహెష్ మాన్లినెస్ కు ఎక్జెంప్షన్) భరత్ అను నేనులో కూడా పాత్రల తీరు పలచబడ్డా అంత తీసికట్టు మాత్రం కాదు. ఫైనల్ గా మహర్షిలో దాదాపు అన్నీ పాత్రలలోని "పాత్రల ఔచిత్యం మరణించింది". అన్ని పాత్రల ప్రామాణిక విలువలు ఒక్క హీరో-ఇజానికి దాసోహం అయిపోయాయి. చివరకు కథానాయిక పాత్ర ఎందుకూ పనికి రాకుండా పోయింది. స్నేహితుల పాత్రలు అణిగిపోయాయి. నాకు అర్ధం కానిది ఒకటే "మీడియా యిచ్చిన సిగ్గుమాలిన రేటింగులు - బహుశా సోల్డ్ దెం సెల్వ్-స్"
  
 "మహర్షి" సినిమాలో ఏముంది గొప్పదనం? అంతే కాదు ఈ సినిమాలో కంటెంట్ ను మించిన కమామిష్ ఏమిటో ఎవరికీ అర్ధం కాదు. దీని అంతిమ ఫలితం కూడా ఇంకా ఎవరికీ అర్థం కావడం లేదు. చిత్ర బృందం మాత్రం పోస్టర్ల మీద ఘనమైన ప్రకటనలు ఇచ్చేస్తోంది. ఈ సినిమాను "చారిత్రాత్మక సంచలనాత్మక విజయం" గా పేర్కొంటోంది. మహేష్ బాబు కెరీర్'స్ బిగ్గెస్ట్ హిట్ల వసూళ్లను ‘మహర్షి’ వారంలోనే దాటేసిందని పేర్కొంటోంది.

కానీ దిల్ రాజు సొంతంగా రిలీజ్ చేసుకున్న నైజాం ఏరియాలోతప్ప ఇంకెక్కడా ఆశించిన స్థాయిలో వసూళ్లు  లేవు. "బ్రేక్ ఈవెన్‌ కు బహుదూరంలో ఉన్న ఈ బాటసారి" కి సరైన సినిమాలు సమ్మర్లో కూడా పోటీలో లేవు.ఈ సినిమా చాలా దూరం ప్రయాణించాల్సి ఉంది.

ఏ ఏరియాలో కూడా ఇప్పటిదాకా "బ్రేక్ ఈవెన్" కాలేదు. సెకండ్ వీకెండ్ కాస్త ఆశాజనకంగానే ఉన్నప్పటికీ. ‘మహర్షి’ ప్రయాణించాల్సిన దూరం బహుదూరం. అయితే చెప్పుకోవలసింది  చాలా ఉంది. యుఎస్, సీడెడ్ లాంటి ఏరియాల్లో ‘మహర్షి’ పెట్టుబడిలో సగమే రాబట్టాడు. ఇప్పుడెంత వసూలైందో? ఇంకా అంత వసూలైతే తప్ప బయ్యర్ల పెట్టుబడి వెనక్కి రాదు.

ఈ రెండు ప్రాంతాలలో బయ్యర్లకు ఐదారు కోట్ల రూపాయల వరకు నష్టాలు తప్పేలా కనిపించడం లేదు. లాభాలు ఆశించి హక్కులు కొంటే, పెట్టుబడి పొగడ్తల వరదలో కొట్టుకుపోగా, విజయం విజయం అనే వరదలో అయ్యో....పాపం! అనే దిక్కు కూడా లేకుండా ఒకేసారి ఇంత నష్టం భరించడమంటే మాటలు కాదు. ఐతే సినిమా డిజాస్టర్ అయితే ముందు నుంచే బయ్యర్లు జాగ్రత్త పడేవారు. నిర్మాత వెంట పడతారు. నష్టపరిహారం అడుగుతారు.

కానీ చిత్ర బృందం మాత్రం "మహర్షి ఎపిక్ బ్లాక్ బస్టర్" అంటూ సంబరాల్లో మునిగిపోతోంది. ఇప్పటికే విజయాల పండగ  అదే 'సక్సెస్ మీట్' కూడా పెట్టారు. పార్టీల మీద పార్టీలు చేసుకుంటున్నారు. నిన్న  విజయవాడలో భారీ స్థాయిలో విజయోత్సవసభ కూడా పెట్టుకున్నారు. ఇప్పటికే రెండు సార్లు కాలర్ ఎగరేసిన మహేష్ బాబు ఈ ఈవెంట్లో కూడా మరోసారి అదే పని చేసినా చేశారేమో! 

నిర్మాతలందరికీ డబ్బులు బాగానే ముట్టాయి.

హీరో కూ తక్కువలో తక్కువ పాతిక కోట్ల రూపాయలు,


హీరోయిన్ ముక్కుపిండి రెండుకోట్ల రూపాయిలైనా చేసిన రికార్డింగ్ డాన్సులకు వసూలుచేసుకొని ఉంటుంది.


దర్శకుడికీ  కీర్తి కనకాలు అంది ఉంటాయి.  


మిగతా ఆర్టిస్టులు, టెక్నీషియన్లు అందరూ హ్యాపీసే ... 


మధ్యలో మునిగి పోయేది పాపం! బయ్యర్లే.  వాళ్ల కష్టం చూడకుండా ఇలా వరుసగా సంబరాలు చేసుకుంటుంటే, మహేష్ బాబు తదితరుల గొప్ప గురించి కనీసం కనీస కష్టం ( బట్టలు కూడా నలగని చెమట పట్టని కష్టం) కూడా పడని,  సినిమా గురించి గొప్పలు పోతుంటే వారు కడుపు మండ కుండా రగిలి పోకుండా ఉంటారా?

మహెష్ బాబు గారు! మీరు ఒకసారి  "విల్ స్మిత్"  సినిమా ........."ది పర్స్యూట్ ఆఫ్ హ్యాపీనెస్"  చూసి మీ నటనను మెరుగు పరచుకోండి. లేకుంటే మీ నటన గోడ మీద కొట్టిన సున్నమే - కొన్నాళ్లకు మాసిపోతుంది 'కాజ్ మీరు మీ ముఖంలో భావాలను పలు విధాలుగా పలికించలేరు. ఇది నిజం మీ మంచికే !


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: