జెర్సీ డైరెక్టర్ కి అల్లూ అర్జున్ ఫోన్ ?
ఇదే క్రమంలో ఈ సినిమా చూసిన అల్లు అర్జున్ డైరెక్టర్ కి ఫోన్ చేసినట్లు ఇద్దరం కలిసి పనిచేద్దామని చెప్పినట్లు ఫిల్మ్ నగర్ లో టాక్ వినపడుతోంది. గౌతమ్ తన మొదటి సినిమా 'మళ్ళీ రావా' తో మంచిపేరు తెచ్చుకున్నాడు కానీ ఇలాంటి ఇంపాక్ట్ అయితే లేదు.
ఈ సారి నాని స్టార్ పవర్ కూడా తోడు కావడంతో సినియా నెక్స్ట్ లెవెల్ కు వెళ్ళిపోయింది. జెర్సీ సినిమాతో తానేంటో నిరూపించుకున్నాడు డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి. మొత్తం మీద జెర్సీ సినిమా మంచి విజయం తో సినిమా యూనిట్ మొత్తం మంచి ఆనందంలో మునిగితేలుతోంది.