వివాదం లో ఇరుక్కుపోయిన అల్లు అర్జున్ సినిమా..?
ఇదిలా ఉండగా ఈ సినిమాలో బాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోయిన్ తనుశ్రీ దత్తా క్యాస్టింగ్ కౌచ్ ఆరోపణలు చేసిన నానాపటేకర్ ను ఈ సినిమాలో అల్లు అర్జున్ తండ్రి క్యారెక్టర్లో తీసుకోవాలని త్రివిక్రమ్ ఆలోచిస్తున్నాడట. అయితే బాలీవుడ్ ఇండస్ట్రీలో అప్పట్లో కాస్టింగ్ కౌచ్ ఆరోపణలు వచ్చిన కారణంగా చాలా సినిమాలలో నానాపటేకర్ నీ పక్కన పెట్టారట. అటువంటి నటుడిని ఇప్పుడు టాలీవుడ్ కి తీసుకొచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి.
ప్రస్తుతం చిత్రయూనిట్ నానాని తీసుకోవాలా..? వద్దా..? అనే విషయంపై చర్చలు సాగుతున్నాయి. ఒకవేళ ఇటువంటి నటుడిని సినిమాలో తీసుకుంటే ఏ విధమైన వివాదాలు వస్తాయి వంటి విషయాలను కూడా ఆలోచిస్తున్నారట సినిమా యూనిట్. మొత్తం మీద నానాపటేకర్ పై వచ్చిన ఆరోపణలు ఇప్పుడు అల్లు అర్జున్ సినిమా ని ఇరుకున పెట్టాయి అని అంటున్నారు సినిమా ఇండస్ట్రీకి చెందినవారు.