బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తున్న అర్జున్ రెడ్డి?!

siri Madhukar

టాలీవుడ్ లో ఇప్పుడు యంగ్ హీరోల్లో నెంబర్ వన్ రేస్ లో ఉన్నాడు విజయ్ దేవరకొండ.  పెళ్లిచూపులు సినిమాతో విజయాన్ని నమోదు చేసుకున్న ఈ హీరో వరుసగా అర్జున్ రెడ్డి, గీతాగోవిందం, టాక్సీవాలా సినిమాలతో వరుసగా బ్లాక్ బస్టర్ విజయాలు అందుకున్నాడు.  కాకపోతే మద్యలో నోటా సినిమా ఫ్లాప్ టాక్ తెచ్చుకున్నా ఈ కుర్ర హీరోకి పెద్దగా ఎఫెక్ట్ రాలేదు.  అంతే కాదు టాక్సీవాలా మూవీ ఒక నెల ముందే నెట్ లో ప్రత్యక్షం అయినా..రిలీజ్ అయిన తర్వాత హిట్ టాక్ తెచ్చుకోవడంతో కలెక్షన్లు కూడా బాగానే వచ్చాయి. 


ప్రస్తుతం టాలీవుడ్ లో దర్శక, నిర్మాతలు విజయ్ దేవరకొండ తో సినిమాలు తీయడానికి ఉత్సాహ పడుతున్నారు.  ఆ మద్య  ఈ హీరో సంవత్సరానికి ఒక్క సినిమా మాత్రమే తీస్తానని..చెప్పిన విషయం తెలిసిందే.  ప్రస్తుతం విజయ్ దేవరకొండ తెలుగు లో బిజీగా ఉన్నా..ఆ మద్య హిందీలో ఒక సినిమా తీస్తున్నాడని వార్తలు వచ్చాయి..కాకపోతే దీనిపై ఇంకా క్లారిటీ రాలేదు. ఇప్పట్లో హిందీలో చేయకపోవచ్చనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. అయితే విజయ్ దేవరకొండ  బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వడానికి రంగం సిద్ధమైపోతోంది.


1983లో వరల్డ్ కప్ క్రికెట్ మ్యాచ్ లో ఇండియా తిరుగులేని విజయాన్ని సాధించింది. ఈ నేపథ్యంలో హిందీలో '1983' టైటిల్ తో ఒక సినిమా చేయడానికి సన్నాహాలు జరిగిపోతున్నాయి. ఈ సినిమాలో కపిల్ దేవ్ పాత్రలో బాలీవుడ్ హీరో రణ్ వీర్ సింగ్ నటిస్తున్నారు.  ఈ సినిమాలో మరో ముఖ్య పాత్రలో విజయ్ దేవరకొండ నటించబోతున్నాడని వార్తలు వస్తున్నాయి. 


1983లో వరల్డ్ కప్ క్రికెట్ మ్యాచ్ లో కీలక పాత్ర పోషించిన కృష్ణమాచారి శ్రీకాంత్ పాత్ర కోసం విజయ్ దేవరకొండను తీసుకున్నారనేది తాజా సమాచారం.  అయితే ఈ విషయంపై అధికారిక ప్రకటన ఇంకా రాలేదు..ఒకవేల ఇదే నిజమైతే విజయ్ దేవరకొండ బాలీవుడ్ లో కూడా తన జెండా పాతబోతున్నాడన్నమాట.  ‘నోటా’సినిమాతో తమిళంలోకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: