అదే జరిగితే.. RCB ఇంటికి వెళ్లక తప్పదా?

praveen
మార్చ్ 22వ తేదీన ప్రారంభమై ఎన్నో రోజుల నుంచి ప్రేక్షకులను అలరిస్తూ వస్తున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ ప్రస్తుతం చివరి దశకు చేరుకుంది అన్న విషయం తెలిసిందే. లీగ్ దశ మ్యాచ్లు ముగిసి ప్రస్తుతం నాకౌట్ మ్యాచ్ లు జరుగుతున్నాయి  ఇక మరికొన్ని రోజుల్లో ఈ ఐపిఎల్ సీజన్లో విజేత ఎవరు అన్న విషయం తేలబోతుంది అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఇటీవలే పాయింట్ల పట్టికలో మొదటి రెండు స్థానాలలో నిలిచిన కోల్కతా నైట్ రైడర్స్, సన్రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య మొదటి క్వాలిఫైయర్ మ్యాచ్ జరిగింది.

 ఇక ఈ మ్యాచ్ లో కోల్కతా నైట్ రైడర్స్ జట్టు అద్భుతమైన ప్రదర్శన చేసి విజయం సాధించింది. ఈ క్రమంలోనే ఎలిమినేటర్ మ్యాచ్ ఆడకుండానే నేరుగా ఫైనల్ అడుగుపెట్టింది. ఇక ఓడిపోయిన సన్రైజర్స్ క్వాలిఫైయర్ 2 మ్యాచ్ ఆడాల్సిన పరిస్థితి వచ్చింది. అయితే నేడు ఇక ఎలిమినేటర్ మ్యాచ్ జరుగుతుంది అన్న విషయం తెలిసింది. పాయింట్లు పట్టికలో ఇక మూడు, నాలుగు స్థానాలలో ఉన్న రాజస్థాన్ రాయల్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య మ్యాచ్ జరగబోతుంది  ఇక అహ్మదాబాద్ లో ఈ మ్యాచ్ జరుగుతుంది  అయితే పాయింట్ల పట్టికలో చివరన ఉన్న ఆర్సిబి జట్టు అనూహ్యంగా ప్లే ఆఫ్ కి అర్హత సాధించింది.

 దీంతో ఆ జట్టు తప్పకుండా టైటిల్ గెలుస్తుందని బలంగా నమ్ముతున్నారు. అయితే నేడు జరగబోయే మ్యాచ్ కి వర్షపు ముప్పు పొంచి ఉంది  అహ్మదాబాద్లో మోస్తారు వర్షం కురిసింది  ఒకవేళ ఇక మ్యాచ్ జరిగే సమయంలో కూడా వర్షం పడితే.. మ్యాచ్ రిజర్వుడు డే రోజు నిర్వహిస్తారు. ఒకవేళ రిజర్వ్డ్ డే రోజు కూడా ఇదే పరిస్థితి కొనసాగితే.. ఇక మ్యాచ్ రద్దు అవుతుంది. దీంతో ఎక్కువ పాయింట్లు ఉన్న జట్టు ఇక క్వాలిఫైయర్ 2 ఆడటానికి ముందుకు వెళుతుంది. తక్కువ పాయింట్లు ఉన్న జట్టు టోర్ని నుంచి నిష్క్రమిస్తుంది  అయితే తక్కువ పాయింట్లు ఉన్న కారణంగా అటు ఆర్సిబి ఇంటికి వెళ్లక తప్పదు. దీంతో ఏం జరుగుతుందో అనే టెన్షన్ అభిమానుల్లో పట్టుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

Rcb

సంబంధిత వార్తలు: