SSMB29 కోసం మహేష్ ఎంత కష్టపడుతున్నాడంటే?

Purushottham Vinay
ఈ ఏడాది గుంటూరు కారంతో హిట్ కొట్టిన మహేష్ రాజమౌళి SSMB29 ప్రాజెక్ట్ కోసం సిద్దమవుతున్న విషయం తెలిసిందే. చాలా కాలంగా చర్చల్లో ఉన్న ఈ సినిమా షూటింగ్ పనులు స్టార్ట్ కాకపోయినప్పటికి మంచి హైప్ ని క్రియేట్ చేస్తోంది. అఫీషియల్ లుక్ కోసం మహేష్ బాబు ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నాడు.ఇక మహేష్ ఇప్పటి దాకా చేసిన సినిమాలు ఒక లెక్క ఇప్పుడు రాజమౌళి తో చేయబోయే ప్రాజెక్టు మరొక లెక్క అని తెలుస్తుంది. ఈ సినిమాలో లుక్ కోసం కఠినమైన శారీరక శిక్షణలో ఉన్నారు మహేష్. యాక్షన్ మూవీగా ఉండబోయే ఈ సినిమాలో తన శరీరాన్ని పవర్ఫుల్ తయారు చేసేందుకు కృషి చేస్తున్నారు. ఇప్పటి దాకా మహేష్ ని కేవలం సన్నగా, ఫిట్ గా మాత్రమే చూసిన అభిమానులకు, ఈ సారి ఆయనని హై వోల్టేజ్ బాడీ లుక్ లో చూడబోతున్నారని సమాచారం తెలుస్తుంది.,ఆయన లుక్ ని ప్రత్యేకంగా డిజైన్ చేయడానికి రాజమౌళి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. ఈ భారీ బడ్జెట్ మూవీ మహేష్ బాబుకి, రాజమౌళి కి ఎంతో ప్రతిష్టాత్మకం అనే చెప్పాలి. ఇప్పటికే ఈ మూవీపై విపరీతమైన అంచనాలు ఉన్నాయి.


సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ మూవీలో తన కెరీర్ లోనే బెస్ట్ లుక్ తో కనిపించబోతున్నారు. ఈ మూవీ కోసం మహేష్ తన బాడీ ని బలంగా మార్చడం పై అభిమానుల్లో ఆసక్తి పెరిగింది. ప్రత్యేకంగా ఫిట్నెస్ ట్రైనర్ సహాయంతో ఎప్పటికప్పుడు జిమ్ లో సూపర్ స్టార్ మహేష్ చెమటలు చిందిస్తున్నారు. 48 ఏళ్ళ వయసులో ఉన్న మహేష్ ఇన్నేళ్ల సినీ కెరీర్ లో ఏ పాత్ర కోసం ఇంత కష్టపడలేదట.ఇప్పటికే మహేష్, కొన్ని వర్క్‌షాపుల్లో కూడా పాల్గొంటున్నారు. ఈ మూవీ షూటింగ్ ప్రారంభం అయ్యే ముందు పక్కా ప్రణాళికలతో వర్క్ షాప్ కూడా నిర్వహించనున్నారు. ఈ మూవీపై వచ్చిన చాలా రూమర్లు, సోషల్ మీడియాలో హడావిడి చేయడం, అభిమానులకు  ఆసక్తిని మరింత పెంచుతోంది.ఇక మూవీని దుర్గా ఆర్ట్స్ బ్యానర్ పై KL నారాయణ నిర్మించనున్నారు. పోస్ట్ ప్రొడక్షన్ కోసమే దాదాపు 6 నెలల సమయం తీసుకోవడంతో, ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రావడానికి రెండేళ్ల కంటే ఎక్కువ సమయం పట్టవచ్చని సమాచారం తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: