కొత్త వివాదంలో ‘సర్కార్’!

siri Madhukar
ఈ మద్య స్టార్ హీరోల సినిమాలు థియేటర్లోకి రాకముందే వివాదాలు సృష్టిస్తున్నాయి..అన్ని వివాదాలు సమసిపోయాయని క్లారిటీ తీసుకొని తీరా థియేటర్లో రిలీజ్ అయిన తర్వాత కొత్త వివాదాలు తలెత్తుతున్నాయి.  ముఖ్యంగా తమిళ నాట సూపర్ స్టార్ రజినీకాంత్, విజయ్ సినిమాల విషయంలో ఈ వివాదాలు మరీ ఎక్కువ అవుతున్నాయి.  ఆ మద్య కబాలి, కాలా సినిమాల విషయంలో కొన్ని వివాదాలు తలెత్తిన విషయం తెలిసిందే.  ఇక విజయ్ నటించిన ‘మెర్సల్’ అయితే యావత్ భారత దేశంలో విమర్శలు, వివాదాలు చుట్టు ముట్టాయి.  ఈ సినిమాలో డాక్టర్స్ ని అవమానించినట్లు, జీఎస్టీపై కొన్ని వివాదాస్పద డైలాగ్స్ ఉన్నట్లు రక రకాలుగా అభ్యంతరాలు వచ్చాయి. 

మొత్తానికి అన్ని వివాదాలు దాటుకొని మెర్సల్ రిలీజ్ కావడం సూపర్ హిట్ కావడం జరిగింది.  ఇప్పుడు మురుగదాస్-విజయ్ కాంబినేషన్ లో వచ్చిన ‘సర్కార్’ పై కొత్త వివాదం తెరపైకి వచ్చింది.  ఈ సినిమా కూడా రాజకీయ కోణంలోనే సాగింది. ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాలు, వరలక్ష్మీ శరత్‌కుమార్ పాత్ర పేరుపై ఇప్పుడు తమిళనాట రచ్చ మొదలైంది. ఈ సినిమాలోని నెగిటివ్ రోల్ పోషించిన వరలక్ష్మీ శరత్‌కుమార్ పాత్ర పేరు కోమలవల్లి. వాస్తవానికి తమిళనాడు దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలిత అసలు పేరు కూడా కోమలవల్లి కావడం వివాదానికి తావైంది.

ఈ వివాదంలో ఏకంగా తమిళనాడు ప్రభుత్వమే రంగంలోకి దిగింది. ఈ సినిమాలో జయలలితని తప్పుగా చూపించారంటూ అన్నాడీఎంకే మంత్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంతే కాదు జయలలిత ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అన్నాడీఎంకే ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొన్ని సంక్షేమ పథకాల(ఉచితాలు)పై కూడా ‘సర్కార్’ సినిమాలో సెటైర్లు వేశారు.

అమ్మను అవమానించే విధంగా కొన్ని సన్నివేశాలు వెంటనే తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. లేదంటే లీగల్ గా ప్రొసీడ్ అవుతామని హెచ్చరిస్తున్నారు. మరి ఇంతకి ఈ వివాదం ఎంతవరకు వెళ్తుందో చూడాలి. ఏఆర్‌ రెహమాన్‌ ఈ చిత్రానికి సంగీతం అందించగా, ఏఆర్‌ మురుగదాస్‌ దర్శకత్వం వహించారు. విజయ్ సరసన అందాల భామ కీర్తి సురేష్ నటించింది. 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: