తెలంగాణా సమస్య కూ, విశ్వరూప కధానాయకుడు కమల్ హాసన్ కూ సంబంధ౦ ఏమిటి అనుకుంటున్నారా..? సంబంధ౦ ఉంది. అయితే ఈ సంబంధం కమల్ హాసన్ కు ఒక తెలంగాణా దర్శకుడి తో ఏర్పడింది. 1995 తరువాత కమల్ హాసన్ చేసిన డైరెక్ట్ తెలుగు మూవీ టాలీవుడ్ లో రాలేదు. ఆయన చేసిన ఆఖరి తెలుగు సినిమా ‘శుభసంకల్పం’. ప్రస్తుతం ‘విశ్వరూపం-2’ సినిమాతో బిజీగా ఉన్న కమల్ హాసన్ ఈ సినిమా పూర్తి కాగానే క్రియేటివ్ దర్శకుడు ఎన్.శంకర్ దర్శకత్వంలో నిర్మించబోతున్న సినిమాలో నటిస్తానని దర్శకుడు శంకర్ కు మాట ఇచ్చాడని టాలీవుడ్ టాక్. ‘జయం మనదేరా’, ‘శ్రీ రాములయ్యా’, ‘జై బోలో తెలంగాణా’ లాంటి మంచి సినిమాలు తీసిన శంకర్ కు క్రియేటివ్ దర్శకుడిగా మంచి పేరు ఉంది.
దాదాపు 60 కోట్ల బడ్జెట్ తో చాలా కాలం తరువాత కమల్ హాసన్ ను ప్రేమికుడిగా చూపెడుతూ నిర్మించబడే రొమాంటిక్ ఎంటర్ టైనర్ ఈ సినిమా అంటున్నారు. తెలుగులో కళాతపస్వి విశ్వనాద్ సినిమాలలో నటించి అమితమైన పేరు తెచ్చుకున్న కమల్ హాసన్ ప్రస్తుతం రకరకాల ప్రయోగాలు చేస్తూ సినిమాలను కోలీవుడ్ లో అవి తెలుగులో కూడా విడుదల అయ్యేలా చూసుకుంటున్నాడు కమల్. సామాన్యంగా ఎవరి స్క్రిప్ట్ ఒప్పుకొని కమల్ హాసన్ శంకర్ సినిమాకు డేట్స్ ఇవ్వడం అందరినీ ఆశ్చర్య పరుస్తోంది. మరొక ముఖ్య విషయం ఏమిటంటే ఒక తమిళ హీరో, ఒక తెలంగాణా దర్శకుడు తీస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ ను ఒక కోస్తాంధ్ర ప్రాంతం నిర్మాత నిర్మిస్తాడని తెలుస్తోంది. దీనిబట్టి కమల్ సమైఖ్యవాది అనుకోవాలి.