వక్కంతం వంశీ పరిస్థితి ఏంటి..!

Prathap Kaluva

వక్కంతం వంశీ ఎన్నో సూపర్ హిట్ సినిమా లకు కథలను అందించారు. అయితే ఆ కథలన్నీ మంచి డైరెక్టర్ చేతి లో పడటం వల్ల హిట్ అయ్యాయి అని చెప్పవచ్చు. నిజానికి కథ ను అల్లడటం వేరు దర్శకత్వం వేరు. కథను రాసినంత సింపుల్ గా డైరెక్షన్ చేయలేరు. కానీ చాలా మంది రచయితలు రెండు మూడు సూపర్ హిట్ కథలు ఇవ్వగానే డైరెక్షన్ లోకి రావాలనుకుంటారు. కానీ అక్కడే బొక్క బోర్లా పడుతున్నారు. కొంత మంది మాత్రమే సక్సెస్ అవుతున్నారు. 


 ఈ మధ్యకాలంలో బన్నీకి లేనటువంటి డిజాస్టర్ తీసిచేతిలో పెట్టారు. వరుడు తరువాత మళ్లీ అంతటి డిజాస్టర్ బన్నీ కోసం తీసిన ఘనత వక్కంతంకే దక్కింది. పోనీ నా పేరు సూర్యలో వేరే వేరే లోపాలు వున్నాయి, వాటికి వక్కంతం బాధ్యుడు కాడు అనుకోవడానికి లేదు. సినిమా మొత్తం డైరక్టర్ ఫెయిల్యూర్ అని క్లియర్ గా అర్థం అయిపోతోంది. ఏ క్రాఫ్ట్ నుంచి కూడా సరైన పనితనం రాబట్టుకోకపోవడం, సరైన ఎమోషన్లు పండించలేకపోవడం, సరైన సీన్లు రాసుకోలేకపోవడం, టోటల్ గా వక్కంతం వంశీ ఫెయిల్యూర్ తప్ప వేరు కాదు అని క్లియర్ అయిపోయింది.


ఇక ఇప్పుడు వక్కంతం వంశీ మాటలకు పడే హీరో ఎవరు? ఈ సినిమా విడుదలకు ముందు చాలా మంది మాట ఇచ్చారు. కానీ ఇప్పుడు వారిలో ఎవరు మాట మీద నిల్చుంటారు? అంటే అనుమానమే. ఎంత మంచి కథ తయారుచేసినా, కోటి ఇస్తాం ఇమ్మంటారు కానీ, డైరక్షన్ ఇస్తారా? అంటే అనుమానమే. అలా ఇచ్చారు అంటే వక్కంతం అదృష్టవంతుడే. ఇచ్చిన వాళ్లు సూపరే సూపరు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: