పరిపూర్ణ నటనకు అర్థం..మహానటి సావిత్రి!

Edari Rama Krishna
తెలుగుసినిమాలను అభిమానించే వారికి మహానటి సావిత్రి గురించి చెప్పడం, చిన్నపిల్లలకు అమ్మ గురించి చెప్పడం  ఒకటే అంటే అతిశయోక్తి కాదు. తన నటనతో మరుపురాని ఎన్నో పాత్రలకు ప్రాణ ప్రతిష్ట చేసిన అద్భత నటి సావిత్రి. కేవలం తన కళ్ళతోనే నవరసాలను పండించే సావిత్రి నటనతోనే ఆ పాత్రలు మన కళ్ళముందు ఇంకా మెదులుతున్నాయన్నది ఏవరూ కాదనలేని వాస్తవం. చిలిపి ప్రియురాలిగా, అందాల చెలిగా, మురిపించే ఆలిగా, బాధ్యత తెలిసిన గృహిణిగా సావిత్రి చూపించిన అభినయం అమోఘం, అద్భతం. 


ఆమె నటన మనసుకు నేరుగా తగిలే చక్కని పైరగాలి. నటిగా ఎందరో హృదయాలలో స్థానం సంపాదించుకున్న సావిత్రి గుంటూరు జిల్లా, తాడేపల్లి మండలంలోని చిర్రావూరు గ్రామంలో 1936 జనవరి 4న నిశ్శంకరరావు గురవయ్య, సుభద్రమ్మ దంపతులకు జన్మించింది.

వారికి సావిత్రి రెండవ సంతానం. కాగా, సావిత్రికి 6 నెలలు నిండగానే టైఫాయిడ్ కారణంగా తండ్రి మరణించాడు. దీంతో సావిత్రి తల్లి విజయవాడలోని తన అక్క దుర్గాంబ ఇంటికి మకాం మార్చింది. దుర్గాంబ భర్త పేరు కొమ్మారెడ్డి వెంకట్రామయ్య. 


అక్కడ మారుతి, సావిత్రి కస్తూరిబాయి మెమోరియల్ స్కూల్ లో చేరారు. పాఠశాలకు వెళ్లేదారిలో నృత్య విద్యాలయం ఉండేది. రోజూ ఇతరులు నాట్యం చేయటం చూసి ఆ నృత్యాలయం చేరి శిష్ట్లా పూర్ణయ్య శాస్త్రీ గారివద్ద నృత్యం నేర్చుకుని విజయవాడలో తన చిన్నతనంలోనే ప్రదర్శనలు ఇచ్చింది. కొంతకాలం ఎన్టీఆర్, జగ్గయ్య తదితరులు నడుపుతున్న నాటకాల కంపెనీలో పనిచేసి, తరువాత స్వయంగా పెదనాన్న నడిపిన నాట్యమండలిలో కూడా నటించింది.


 తరువాత పెదనాన్న ప్రోద్బలంతో సినిమా రంగం వైపు దృష్టి సారించి ఎన్నో కష్టాలనోర్చి తిరుగులేని అభినేత్రిగా విరజిల్లింది. సంసారం చిత్రంలో చిన్నపాత్రతో సినీరంగ ప్రవేశం చేసిన సావిత్రికి దేవదాసు చిత్రంతో మంచి గుర్తింపు వచ్చింది. మిస్సమ్మ చిత్రంతో అగ్రకథానాయికగా స్ధిరపడింది. ఇక తరువాత నుంచి సావిత్రి వెనుతిరిగి చూడలేదు. 


ఎన్నో చిత్రాలలో తనదైన, తనకు మాత్రమే సాధ్యమైన నటనను ప్రదర్శించి సిని అభిమానుల గుండెల్లో సుస్ధిర స్థానాన్ని దక్కించుకుంది. కన్యాశుల్కంలో మధురవాణిగా సావిత్రి కళ్ళతోనే చేసిన అభినయం సినీ ప్రియులను మైమరిపిస్తే, మాయాబజార్ లో సావిత్రి నటనకు అందరూ దాసోహం అయ్యారు. కలసి ఉంటే కలదు సుఖం, గుండమ్మకథ, దేవత వంటి అనేక చిత్రాలలో సావిత్రి తన నటనతో ఆయా పాత్రలకు ప్రాణం పోసింది.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: