నిన్న జరిగిన ‘వాపేరు సూర్య’ ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో ఆవేశంగా మాట్లాడిన అల్లు అరవింద్ ఈమూవీ పై కుట్ర జరుగుతున్న విషయాన్ని బయటపెట్టి అందర్నీ ఆశ్చర్య పరిచారు. కొద్దిరోజులక్రితం టాలీవుడ్ ఇండస్ట్రీ పరువు బజారున పడుతున్న నేపధ్యంలో ఇండస్ట్రీని రక్షించడానికి కొన్ని నిర్ణయాలు తీసుకోవడం జరిగిందని ఆ నిర్ణయాల వల్ల బాధపడుతున్న కొంతమంది పనికట్టుకుని ‘నాపేరు సూర్య’ పై నెగిటివ్ టాక్ స్ప్రెడ్ చేసి ఈసినిమాను దెబ్బతీయాలని వ్యూహాలు రచిస్తున్న విషయం తనకు తెలుసు అంటూ అరవింద్ చేసిన సంచలన కామెంట్స్ తో ఈ ఫంక్షన్ కు వచ్చిన వారంతా ఆశ్చర్యపోయారు.
ఇదే సందర్భంలో అరవింద్ మాట్లాడుతూ ‘సూర్య’ పై జరగబోతున్న ఈ కుట్రను అడ్డుకునే శక్తి ఒక మెగా అభిమానులకే ఉందని ఈవిషయం పై చాల అప్రమత్తంగా ఉండాలి అంటూ అరవింద్ మెగా అభిమానులకు హెచ్చరికలు జారీ చేసాడు. ఇలా ఆవేశంతో అరవింద్ మైక్ ముందు మాట్లాడుతున్నప్పుడు ఆవిషయాలను విని ఆస్చర్యపోతున్న అల్లు అర్జున్ ను చూసి ‘ఈవిషయాలు నీకు తెలియవు తరువాత చెపుతాను’ అంటూ మరొక ట్విస్ట్ ఇచ్చాడు అరవింద్.
దీనితో అప్పటి వరకు సజావుగా జరుగుతున్న ‘సూర్య’ ప్రీ రిలీజ్ ఫంక్షన్ సమ్మర్ ఎండ వేడికి మించి మరింత వేడెక్కిపోయింది. దీనితో ‘నాపేరు సూర్య’ పై బ్యాడ్ టాక్ పుట్టించి కుట్ర చేయబోతున్నది కొన్ని న్యూస్ ఛానల్స్ అనుకోవాలా? లేదంటే మరేదైనా విషయం ఉందా ? లేకుంటే కేవలం అనుమానాలతో అరవింద్ ఈమూవీకి ఒక హైక్ తీసుకురావడానికి అరవింద్ ఇలా వ్యూహాత్మకంగా కామెంట్ చేసాడా అంటూ ఆ ఫంక్షన్ కు వచ్చిన చాలామంది కామెంట్స్ చేసుకున్నట్లు టాక్.
మరికొందరైతే అరవింద్ స్పీచ్ లో మరో కోణం అంతర్లీనంగా ఉంది అని అంటున్నారు. ‘నాపేరు సూర్య’ సినిమాకు ఎంత ప్రయత్నించినా ఇప్పటికీ చెప్పుకోతగ్గ క్రేజ్ ఏర్పడని నేపధ్యంలో ఈమూవీ ఫలితంలో తేడా వస్తే ఆ ఫలితం వెనుక కుట్ర ఉంది అంటూ తెలివిగా ఫెయిల్యూర్ టాక్ నుండి తప్పించు కోవడానికి అరవింద్ ఇలాంటి ఎత్తుగడ వేసాడు అని కొందరు అంటున్నారు. ‘సూర్య’ ఫంక్షన్ లో చెప్పుకోతగ్గ సంచలనాలు ఉండవు అని అనుకుంటున్న సమయంలో ఎవరు ఊహించని విధంగా అరవింద్ ఇచ్చిన షాక్ తో ప్రస్తుతం ఈమూవీ ఫంక్షన్ విషయాలు మీడియాకు హాట్ టాపిక్..