ఇండస్ట్రీని చులకన చేసి మాట్లాడొద్దు : నాగబాబు

Edari Rama Krishna
ఇప్పటి వరకు కాస్టింగ్ కౌచ్ పై టాలీవుడ్ లో పెను సంచలనాలు జరిగాయి.  నటి శ్రీరెడ్డి తెలుగు ఇండస్ట్రీలో నటించడానికి వచ్చే అమ్మాయిలను కొంత మంది ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు, హీరోల దగ్గర నుంచి జూనియర్ ఆర్టిస్టులను సప్లై చేసే వారి వరకు అమ్మాయిలను వాడుకునే వారు అని ఆరోపించారు.  ఆ మద్య ‘మా’ ఫిలిమ్ ఛాంబర్ ముందు అర్థనగ్న ప్రదర్శన చేయడంతో విషయం కాస్త సీరియస్ అయ్యింది. 

అప్పటి నుంచి శ్రీరెడ్డికి మహిళా సంఘాలు మద్దతు పలికాయి.  ఇదిలా ఉంటే..నిన్న శ్రీరెడ్డి పవర్ స్టార్ పవన్ కళ్యాన్..వారి తల్లిగారిని అనుచిత వ్యాఖ్యలు చేసింది. దాంతో సామాన్యుల దగ్గర నుంచి సెలబ్రెటీల వరకు పెద్ద ఎత్తున రియాక్ట్ అయ్యారు.  శ్రీరెడ్డి పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ట్రోల్స్ పెడుతున్నారు. తాజాగా ఈ విషయంపై స్పందించిన మెగా బ్రదర్ నాగబాబు మీడియాతో సమావేశం అయ్యారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..క్యాస్టింగ్ కౌచ్ అనేది ప్రపంచంలో అందరికీ తెలిసిన విషయమేనన, ఇప్పుడు కొత్తగా వచ్చిన అంశమేమీ కాదని అన్నారు. ఈ వ్యవహారాన్ని గత నెల రోజులుగా గమనిస్తున్నానని, ‘మా’లో సభ్యత్వం ఉన్న, సభ్యత్వం లేని లేడీ ఆర్టిస్టులపై ఎవరైనా అసభ్యంగా ప్రవర్తిస్తే ఫిర్యాదు చేయవచ్చని, దేశంలో చట్టాలు చాలా కఠినంగా ఉన్నాయని అన్నారు. ఇండస్ట్రీని చులకన చేసి మాట్లాడొద్దని సూచించారు. మహిళలంటే తమకు ఎంతో గౌరవమని, తన కూతురుని కూడా సినీ పరిశ్రమలోకి తీసుకొచ్చానని అన్నారు. 

నిర్మాతలు కోట్లు పెట్టి సినిమాలు తీస్తారని..సినిమా కథకు తగ్గట్టు గా నటీనటులను తీసుకుంటారని..అలాంటిది ‘మా’ అసోసియేషన్ చెప్పే నటులను మాత్రమే తీసుకోరని అన్నారు.  ఏ సినిమా అయినా కోట్లు పెట్టి తీయాలి..ఒకవేళ నష్టం వస్తే..ఆ నటులు తిరిగి ఇవ్వరు కదా..మా అసోసియేషన్ ఇవ్వరు కదా! అన్నారు.  ఇక తన తమ్ముడిపై చేసిన వ్యాఖ్యలను ఖండించారు. 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: