అను ఇమ్మాన్యుయేల్ కు శాపంగా మారిన బన్నీ నిర్ణయం !

Seetha Sailaja
అను ఇమ్మాన్యుయేల్ కు నడుస్తున్న కాలం ఏమాత్రం కలిసి వస్తున్నట్లు అనిపించడం లేదు. ఆమె టాప్ హీరోయిన్ రేంజ్ కి ఎదగాలి అని చేస్తున్న ప్రయత్నాలకు ఆమె అదృష్టం ఏమాత్రం సహకరించడం లేదు. పవన్ ‘అజ్ఞాతవాసి’ తో తనకు కలిసి వస్తుంది అని అనుకున్న అదృష్టం చేయి జారిపోవడంతో ఇప్పుడు ఈమె ఆశలన్నీ ఆమె నటిస్తున్న అల్లు అర్జున్ ‘నాపేరు సూర్య’ పై పెట్టుకుంది. అయితే ఈసినిమా విడుదల కాకుండానే ఈమూవీ ఈ గ్లామర్ బ్యూటీకి శాపంగా మారడం   ప్ర‌స్తుతం టాపిక్ ఆఫ్ ది టాలీవుడ్‌ గా మారింది. 

తెలుస్తున్న సమాచారం మేరకు ఈమధ్య అల్లు అర్జున్ ‘నా పేరు సూర్య‌’ ర‌షెస్ చూసి కొన్ని విషయాలలో అసంతృప్తి వ్యక్త పరిచి కొన్ని సీన్ల‌కు క‌త్తెర వేయ‌మ‌ని చెప్పినట్లు టాక్. ఈమూవీలో బన్నీ దేశంకోసం పోరాడే సైనికుడిగా అలాగే ప్రేమ‌ను గెలిపించుకునే ప్రేమికుడిగా క‌నిపించ‌బోతున్నాడు. అయితే ఈసినిమా కథ ప్ర‌ధానంగా దేశ‌భ‌క్తి చుట్టూ అల్లిన నేపధ్యంలో ఈమూవీలో లవ్ సీన్ల‌కు ఎక్కువ స‌మ‌యాన్ని కేటాయించ‌డం సినిమా ఫ్లో దెబ్బ‌తినేలా ఉంద‌ని బన్నీ అభిప్రాయప‌డ్డాడ‌ట‌. 


అందుకే  ల‌వ్ సీన్ల‌కు క‌త్తెర వేయ‌మ‌ని ద‌ర్శ‌కుడు వక్కంతం వంశీకి అల్లు అర్జున్ చెప్పినట్లు సమాచారం. ఈమూవీ కథలో ప్రేమ స‌న్నివేశాలు చిన్న భాగ‌మే త‌ప్ప అది క‌థను డీవియేట్ చేసేలా ఉండ‌కూడ‌ద‌ని బ‌న్నీ వక్కంతంకు క్లాస్ పీకినట్లు సమాచారం. దీనితో బన్నీ అను ఇమ్మాన్యుయేల్ మధ్య చిత్రీకరించిన కొన్ని రొమాంటిక్ సన్నివేశాలకు కత్తెర పడుతున్నట్లు తెలుస్తోంది. 


అంతేకాదు ఈమూవీకి సంబంధించి ఇప్పటికే చిత్రీకరించిన ఒక డ్యూయెట్ సాంగ్ లో ఒక చరణం కోత వేసే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. దీనికి కారణం ఈ చరణంలో బన్నీ అనూల మధ్య హాట్ ఎక్స్ పోజింగ్ సీన్స్ అని అంటున్నారు. ఉద్వేగానికి గురి చేసే ఇలాంటి యాక్షన్ మూవీలో లవ్ కి ఎక్కువ స్పేస్ ఇవ్వడం మంచిదికాదు అని అల్లుఅర్జున్ అభిప్రాయ పడుతున్నట్లు తెలుస్తోంది. కారణాలు ఏమైనా బన్నీ సినిమాతో యూత్ కు బాగా కనెక్ట్ అవ్వాలి అని అను ఇమ్మాన్యుయేల్  చేసిన ప్రయత్నాలకు ఆదిలోనే అడ్డంకులు ఎదురౌతున్నాయి అనుకోవాలి..  


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: