శ్రీదేవి దుర్మరణం.. ఆర్జివి రియాక్షన్ ఇది.. శ్రీదేవితో పాటు దేవుడిని కూడా..!

shami
సినీ నటి శ్రీదేవి మరణం అందరిని షాక్ అయ్యేలా చేసింది. ఇండియన్ సినిమా చరిత్రలో ఆమె అందం అభినయం ఓ ప్రస్థానంగా నిలిచింది. శనివారం రాత్రి గుండెపోటుతో శ్రీదేవి మరణించడం జరిగింది. తెలుగు, తమిళ, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో దాదాపు 250కి పైగా సినిమాల్లో నటించింది శ్రీదేవి.


శ్రీదేవి మరణానంతరం ఆమె అభిమాని, ప్రముఖ దర్శకుడు రాం గోపాల్ వర్మ రియాక్షన్ ఎలా ఉంటుందా అని అందరు ఎదురుచూస్తారు. శ్రీదేవి అభిమానిగా ఎప్పుడు వార్తల్లో ఉండే ఆర్జివి ఆమె మరణ వార్త విని షాక్ కు గురయ్యాడు. ఈ రోజు దేవుడిని ద్వేషించినంతగా ఏరోజు ద్వేషించనని అన్నాడు. బ్రైట్ నెస్ అంతా పోయిందని.. నిజంగా శ్రీదేవి మరణించిందా.. నన్ను ఎవరైనా ఈ చెడు కల నుండి బయటపడేస్తారా అని ట్వీట్ చేశాడు.


ఐ హేట్ గాడ్ ఫర్ కిల్లింగ్ శ్రీదేవి, అండ్ ఐ హేట్ శ్రీదేవి ఫర్ డయ్యింగ్ అంటూ ఆమె మీద ఉన్న ప్రేమను చూపాడు అంతేకాదు శ్రీదేవి మీద తనకు ఉన్న అభిప్రాయాన్నంతా ఓ మెసేజ్ రూపంలో పెట్టాడు ఆర్జివి. ఆమె మీద ఎప్పుడు తన అభిమానం ప్రేమను చూపించిన వర్మ శ్రీదేవి మరణంతో కాస్త డిస్ట్రబ్ అయ్యాడని చెప్పొచ్చు.


రాత్రి పడుకున్నప్పుడు శ్రీదేవి మరణ వార్త విని షాక్ అయ్యానని.. అది కలగా అనుకున్న వర్మ.. ఆ తర్వాత గంట తర్వాత చూస్తే దాదాపు తనకు అదే రకమైన 50 మెసేజులు వచ్చాయని అన్నాడు. మొత్తానికి శ్రీదేవి మరణించడం వర్మ ఆమె మీద ఉన్న అభిమానం అంతా చూపించేశాడు. 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: