త్రివిక్రం, ఎన్టీఆర్ టైటిల్ ఇదే.. రికార్డుల చెడుగుడు ఆడేందుకు రెడీ..!

shami
యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ మాటల మాంత్రికుడు త్రివిక్రం కలిసి చేస్తున్న సినిమా మార్చి నుండి రెగ్యులర్ షూటింగ్ కు వెళ్తుంది. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్లో వస్తున్న ఈ సినిమా కె.రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. పవన్ చేతుల మీదగా ముహుర్తం పెట్టుకున్న ఈ సినిమాలో తారక్ ఫిట్ నెస్ తో కనిపిస్తాడని తెలుస్తుంది.


అందుకోసమే ఇప్పటికే జిం ట్రైనర్ ను పెట్టుకున్నాడట. ఇక ఈ సినిమా టైటిల్ గా సోల్జర్, రాముడు భీముడు అన్నవి వినిపించగా.. ఇప్పుడు సరికొత్త టైటిల్ ఇండస్ట్రీలో చెక్కర్లు కొడుతుంది. ఈమధ్యనే హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్లో ఆన్ సైలెంట్ మోడ్ అన్న టైటిల్ రిజిస్టర్ చేయించారట. ఇదే టైటిల్ తో తారక్ సినిమా వస్తుందని అంటున్నారు.


అనిరుద్ రవిచందర్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాలో ఫైనల్ గా డిజే భామ పూజా హగ్దె హీరోయిన్ గా సెలెక్ట్ అయ్యింది. ఆన్ సైలెంట్ మోడ్ త్రివిక్రం మార్క్ సినిమాగా రాబోతుందట. అయితే ఈ సినిమా టైటిల్ ఇదే కన్ఫామా కాదా అన్నది తెలియాల్సి ఉంది. ప్రీ ప్రొడక్షన్ వర్క్ మొత్తం పూర్తి చేసుకున్న ఈ సినిమా రెగ్యులర్ షూట్ మొదలు పెట్టడమే ఆలస్యం ఏమాత్రం లేట్ చేయకుండా సినిమా పూర్తి చేస్తారట. 


మరి తారక్ తో త్రివిక్రం.. క్రేజీ కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమా ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి. అజ్ఞాతవాసి ఫ్లాప్ తర్వాత త్రివిక్రం, వరుస హిట్లతో ఫాం లో ఉన్న ఎన్.టి.ఆర్ ఇలా ఇద్దరు కలిసి ఎలాంటి అద్భుతాన్ని సృష్టిస్తారో అని ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: