భానుమతి పాత్రలో భాగమతి - మహనటి సినిమాపై జమున షాకింగ్ కామెంట్స్

వైజయంతీ మూవీస్ బానరులో చలసాని అశ్వనీదత్ నిర్మాణ నిర్దేశకత్వంలో నాగ్ అశ్వీన్ దర్శకత్వం వహిస్తున్న "మహానటి" సినిమా మహానటి సావిత్రి జీవిత చరిత్ర ప్రధాన కథాంశంగా తెరకెక్కుతున్న సినిమాలో "మహానటి" పాత్రలో మళయాళి ముద్దుగుమ్మ కీర్తి సురేష్ నటిస్తున్న ఈ సినిమాలో జర్నలిస్టు పాత్రలో సమంత కూడా ఒక ముఖ్య భూమిక పోషిస్తోంది. విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్, షాలినీపాండే, మోహన్ బాబు, ప్రకాష్ రాజ్, క్రిష్, అవసరాల శ్రీనివస్, మాళవిక నాయర్ కూడా ఈ చిత్రంలో కీలకపాత్రల్లో కనిపించనున్నారు.

సింగీతం శ్రీనివాసరావు సావిత్రి జీవితసమకాలీన దర్శకుడు. సంగీతం మిక్కి-జె-మేయర్. సినిమాటోగ్రఫి దని సాంచ్-లోపెజ్. ఏఎన్నార్ పాత్రలో నటించటానికి నాగ‌చైత‌న్య అంగీకరించినట్లు స‌మాచారం. ఎన్టీఆర్ పాత్రకోసం తమిళనటుడు సూర్య పేరు ప‌రిశీలిస్తున్నారు. వీళ్లంతా తెర‌పై క‌నిపిస్తే, టాలీవుడ్‌లోనే "మహాన‌టి" భారీ మల్టీస్టారర్ సినిమా అవుతుంది.


భానుమ‌తి పాత్రకు ఎంతో ప్రాముఖ్యంఉంది. భానుమ‌తిది చాలా ప‌వ‌ర్-ఫుల్ క్యారెక్ట‌రైజేష‌న్‌ కావటంతో గతంలో అనుష్కని కుదరకపోతే విద్యాబాలన్ ని నటింపజేయాలని అనుకున్నారట. అయితే ఆ పాత్ర కోసం అనుష్కని సంప్రదించినట్లు తెలిసింది. ఈ సినిమాలో సావిత్రికి సన్నిహితురాలు, పవర్-ఫుల్ నటీమణి మేటిన‌టి,గాయ‌కురాలు, భానుమ‌తి కూడా ‘సావిత్రి’ జీవిత క‌థ‌లో ఒక కీల‌క పాత్ర పోషించింది. సినిమా ప్రారంభానికి ముందే చిత్ర యూనిట్ అనుష్క షెట్టిని సంప్రదించారట. అయితే, ఆనాటి పరిస్థితుల్లో అంగీకరించిందా? లేదా?  అనేది తెలియలేదు. అయితే, ఇంతవరకు ఆ పాత్రకు సంబంధించిన సన్నివేశాలు చిత్రీకరించలేదు. అయితే ఇప్పుడు ఆ పాత్ర లో స్వీటీ బ్యూటీ షూటింగ్‌ లో పాల్గొనే అవకాశాలున్నాయని తెలుస్తుంది.  


ఆమె తెర‌పై క‌నిపించేది ఒక‌ ట్రెండు సన్నివేశాలే. కాకపోతే ఆయా సన్నివేశాలు చాలా కీల‌క‌మ‌ని, అందులో అనుష్క న‌ట‌న ఎప్ప‌టికీ గుర్తుండిపోయేలా ఉంటుంద‌ని చెబు తున్నారు. ఈ మద్యనే భాగమతి పాత్రలో తన నటవిశ్వరూపం ప్రదర్శించింది. ఇక ఇప్పుడు మహానటి సినిమాలో భానుమ‌తి పాత్రను ఖచ్చితంగా ప్రేక్షక  హృదయాలను ఓలలాదించటం తథ్యం.


ఈ సినిమా మార్చి 28న తెలుగు, తమిళం, మలయాళభాషల్లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. 

మహనటి సినిమాపై జమున షాకింగ్ కామెంట్స్ 

అయితే తాజాగా ఈ సినిమాపై సినియర్ హీరోయిన్ జమున ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. "సావిత్రి గురుంచి ఏం తెలుసని సినిమా చేస్తున్నారు అని ప్రశ్నించారు జమున. సావిత్రి జీవితాన్ని దగ్గరుండి చూశాను. ఈ మధ్య ఎవరో దర్శకుడు సావిత్రి జీవిత కథతో సినిమా చేస్తున్నారని విన్నాను. ఆమె గురించి అతనికి ఏం తెలుసని సినిమా రూపొందిస్తున్నాడో తెలియదు. ఆమెతో అనుబంధం ఉండి బతికున్న ఒకే ఒకదాన్ని నేను. నాలాంటి వాళ్లను కనీసం సంప్రదించకుండా సినిమా చేస్తున్నారు. అయినా సావిత్రికి తెరరూపమివ్వ గల నాయికలు ఉన్నారా?" అంటూ ఒక్కింత షాకింగ్ కు గురైయింది జమున


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: