టాలీవుడ్ లో ఈ మద్య కొత్త హీరోయిన్లు ఎంతో మంది వస్తున్నారు. అయితే వారందరూ గ్లామర్ పైనే ఎక్కువ దృష్టి పెడుతున్న విషయం తెలిసిందే. ఇక ‘సూపర్’ సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన అనుష్క అతి తక్కువ కాలంలోనే అగ్ర హీరోయిన్ నెంబర్ వన్ పొజీషన్ లోకి వచ్చంది. తెలుగు, తమిళ ఇండస్ట్రీలో బిజీ హీరోయిన్ గా మారిన గ్లామర్ కి మాత్రమే ప్రాధాన్యత ఇవ్వకుండా నటనకు మంచి ప్రాధాన్యత ఇస్తుంది.
తాజాగా అనుష్క నటించిన ‘భాగమతి’ సినిమా కలెక్షన్లలో దూసుకు వెళ్తుంది. తొలిరోజునే పాజిటాక్ తెచ్చుకున్న ‘భాగమతి’ అన్ని ఏరియాల్లో దూసుకుపోతోంది. ప్రపంచ వ్యాప్తంగా మొదటివారం లోనే సుమారు రూ.20 కోట్లు వసూలు చేసి నిర్మాతకు భారీ లాభాలనే ముట్టచెప్పింది. గతంలో అనుష్క ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘రుద్రమదేవి’ అమెరికాలో 9.71 లక్షల డాలర్లను వసూలు చేసింది. తాజాగా ‘భాగమతి’ ఆరికార్డును చెరిపేసింది.
ఇదిలా ఉంటే.. శనివారంతో ఈ సినిమా ఓవర్సీస్ మార్కెట్లో మిలియన్ డాలర్ల క్లబ్లో చేరింది. ఇప్పటికే ఈ జాబితాలో 37 తెలుగు చిత్రాలు ఉండగా.. 38వ చిత్రంగా 'భాగమతి' చేరినట్లయ్యింది. అంతేగాకుండా, హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీస్ కేటగిరిలో మిలియన్ డాలర్ల క్లబ్లో చేరిన తొలి చిత్రమిదే కావడం విశేషం.
ఇప్పటికే 9.80 లక్షల డాలర్లను ఖాతాలో వేసుకున్న భాగమతి మిలియన్ మార్క్‌కు అతి సమీపంలో ఉంది. మొత్తానికి చాలా మంది టాలీవుడ్ హీరోలకు సైతం సాధ్యం కాని రికార్డును అనుష్క అందుకుంది. జి.అశోక్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ సంస్థ నిర్మించింది. యువ సంగీత సంచలనం తమన్ అందించిన నేపథ్య సంగీతం.. ఈ చిత్రానికి ఎస్సెట్‌గా నిలిచింది.