ప్రభాస్ పెళ్లి గురించి ఆసక్తికర విషయాలు చెప్పారు..!

Edari Rama Krishna
టాలీవుడ్‌లో మోస్ట్ బ్యాచిలర్ లిస్ట్‌లో మొదటిస్థానంలో ఉన్నారు హీరో ప్రభాస్.  రెబల్ స్టార్ కృష్ణం రాజు నట వారసుడిగా ‘ఈశ్వర్’ చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చి ఫస్ట్ లుక్ లోనే మాస్ హీరోగా మంచి ఇమేజ్ సంపాదించాడు.  ఆ తర్వాత వచ్చిన సినిమాలు పెద్దగా విజయం సాధించకున్నా..రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ‘చత్రపతి’ చిత్రంతో స్టార్ ఇమేజ్ సొంతం చేసుకున్నాడు. 

ఆ తర్వాత వరుస విజయాలు సాధిస్తున్న ప్రబాస్ ‘బాహుబలి’, ‘బాహుబలి 2 ’ చిత్రాలతో ఏకంగా జాతీయ స్థాయి నటుడిగా గుర్తింపు పొందాడు.  అయితే ప్రభాస్ సినిమాల మీద చూపుతున్న ఆసక్తిని పెళ్లి మీద మాత్రం చూపడం లేదు. ఇదిలా ఉంటే మరోవైపు ప్రభాస్ పెళ్లికి ఎప్పుడు ఓకే చెబుతాడో అంటూ ఎప్పటినుండో ఎదురుచూస్తున్నారు అతని కుటుంబసభ్యులు. ఆ మద్య ప్రభాస్ వివాహం విషయంలో సోషల్ మీడియాలో రక రకాల రూమర్లు వచ్చాయి.  ఓ ఇంజనీరింగ్ అమ్మాయితో ఏకంగా ఎంగేజ్ మెంట్ అయినట్లు వార్తలు హల్ చల్ చేశాయి. 

ఇక ప్రభాస్ పెళ్లికి సిద్ధమని చెప్పిన వెంటనే సంబంధాలు చూడటం ప్రారంభిస్తామని అన్నారు క‌ృష్ణంరాజు. అయితే వివాహం విషయంలో మాత్రం జాతకాలను కచ్ఛితంగా చూస్తామని, ఇద్దరి జాతకం కుదిరితేనే పెళ్లి చేస్తామని ఆయన చెప్పారు. మరి ప్రభాస్ జాతకానికి సరిపోయే ఆ లక్కీ లేడి ఎక్కడుందో తెలియాలంటే మాత్రం కొద్ది రోజులు ఆగాల్సిందే.

రీసెంట్ గా సోషల్ మీడియాలో కొత్త రూమర్లు పుట్టుకొచ్చాయి..ప్రభాస్ తో మిర్చి సినిమా నుంచి బాహుబలి, బాహుబలి 2 లో నటించిన అనుష్కను ప్రేమించి పెళ్లిచేసుకోబోతున్నట్లు పుకార్లు షికార్లు చేశాయి.  అయితే వాటిపై ప్రభాస్ మేం మంచి స్నేహితులం అని క్లారిటీ ఇచ్చాడు.  


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: