సింగిల్ పేరెంట్ లైఫ్ ఎలా ఉంది.. సానియా మీర్జా సమాధానం ఏంటో తెలుసా?

praveen
దుబాయ్ స్పోర్ట్స్ అంబాసిడర్‌గా రీసెంట్‌గా బాధ్యతలు చేపట్టిన సానియా మీర్జా ప్రస్తుతం చాలా బిజీగా ఉన్నారు. అయితే ఆమె సక్సెస్ ఫుల్ కెరీర్‌ను సినిమాగా మలిస్తే ఎంతోమందికి స్ఫూర్తిదాయకంగా ఉంటుంది. అందుకే ఆమె బయోపిక్ గురించిన చర్చ ఎప్పటినుంచో జరుగుతోంది. కానీ ఈ మధ్యకాలంలో తనకేమీ అలాంటి ఆఫర్లు రాలేదని ఆమె చెబుతున్నారు. బహుశా తన మేనేజర్లకు ఏమైనా తెలిసి ఉండొచ్చు అంటూ సరదాగా వ్యాఖ్యానించారు సానియా.
కెరీర్ పరంగా బిజీగా ఉన్నప్పటికీ.. సానియా తన టెన్నిస్ అకాడమీల బాధ్యతలను కూడా చూసుకుంటున్నారు. కొద్ది రోజుల క్రితమే తన కుమారుడు ఇజాన్‌తో కలిసి కొత్త సంవత్సర వేడుకల్లో పాల్గొన్నారు. "నాకు ఎప్పటికీ తోడుండేవాడు" అంటూ కొడుకుతో దిగిన ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు సానియా. తన కుమారుడు ప్రస్తుతం ఆరేళ్ల వయస్సులో ఉన్నాడు.
 అంతేకాదు ఒక ఇంటర్వ్యూలో సింగిల్ మదర్‌గా తన జీవితం గురించి సానియా కొన్ని ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నారు. తన కెరీర్‌లో ఎన్ని విజయాలు సాధించినా.. తన కుమారుడు ఇజాన్ అన్నిటికంటే ముఖ్యం అని ఆమె స్పష్టం చేశారు. అందుకే ప్రొఫెషనల్ లైఫ్‌తో పాటు తల్లిగా తన బాధ్యతలకు సమ ప్రాధాన్యతనిస్తున్నారు. అత్యవసరమైతే తప్ప ఆమె పనుల కోసం బయటకు వెళ్లడం లేదు. ఒకవేళ వెళ్లాల్సి వస్తే ఒకటి లేదా రెండు రోజులకు మించి కుమారుడికి దూరంగా ఉండటానికి ఇష్టపడరు.
ప్రజా జీవితంలో ఉండటం వల్ల కొన్ని సవాళ్లు ఉంటాయని సానియా అన్నారు. తనకున్న ఫేమ్ తనపై ఒత్తిడి తీసుకురాకపోయినా.. బాధ్యత మాత్రం బాగా పెరిగిందని ఆమె తెలిపారు. ఎందుకంటే చాలామంది పిల్లలు తనను ఆదర్శంగా భావిస్తారని.. అందుకే తాను ఎలా ప్రవర్తిస్తున్నాననే దానిపై దృష్టి పెడతానని అన్నారు. ప్రజల దృష్టిలో ఉన్నప్పటికీ.. తన నిజాయితీని వీడకుండా మనసులోని మాటను మాట్లాడతానని చెప్పారు. ఇలాంటి గుర్తింపు రావడం ఎంతో గర్వంగా, గౌరవంగా భావిస్తున్నానని సానియా పేర్కొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: