గేమ్ ఛేంజర్ అంచనాల పై దిల్ రాజ్ సంచలన వ్యాఖ్యలు !
సంక్రాంతికి వస్తున్న మూడు సినిమాలలో అత్యంత భారీ సినిమా ‘గేమ్ ఛేంజర్’ ఈమూవీ గురించి మెగా అభిమానులు ఎంతో ఆశక్తిగా ఎదురు చూస్తున్నప్పటికీ ఈమూవీ పై సగటు ప్రేక్షకుడులో ఇంకా పూర్తిగా క్రేజ్ పెరగక పోవడం కొందరికి ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. గత కొన్ని సంవత్సరాలుగా వరస పరాజయాలతో సతమతమైపోతున్న దర్శకుడు శంకర్ ఈమూవీకి దర్శకత్వం వహించడంతో ఊహించిన స్థాయిలో ఈమూవీ పై క్రేజ్ పెరగడంలేదు అన్న కామెంట్స్ కొందరు చేస్తున్నారు.
అయితే ఈ వ్యతిరేక పరిస్థితులను లెక్క చేయకుండా నిర్మాత దిల్ రాజ్ ఈమూవీని చాల వ్యూహాత్మకంగా ప్రమోట్ చేస్తూ ఈమూవీ పై అంచనాలు పెంచడానికి నిర్మాత దిల్ రాజ్ తనవంతు ప్రయత్నం చేస్తున్నారు. లేటెస్ట్ గా దిల్ రాజ్ హైదరాబాద్ లో నిర్వహించిన ఒక ప్రెస్ మీట్ లో ఈమూవీ పై కొన్ని ఆశక్తికర కామెంట్స్ చేశారు. ఈమూవీ పై మొదట్లో నెగిటివిటీ వచ్చిన విషయం తనకు తెలుసని అయితే ఈమూవీ ట్రైలర్ విడుదల అయిన తరువాత ఆ నెగిటివిటీ అంతా తొలిగిపోయి ఈమూవీ పై అంచనాలు బాగా ఉన్నాయి అంటూ ఆశక్తికర కామెంట్స్ చేశారు.
వాస్తవానికి ‘ఇండియన్ 2’ ఫలితం తరువాత దర్శకుడు శంకర్ సమర్థత పై కొందరికి అనుమానాలు ఏర్పడినప్పటికీ ‘గేమ్ ఛేంజర్’ విషయంలో దర్శకుడు శంకర్ తీసుకున్న ప్రత్యేక శ్రద్ధ ఈమూవీని చూడబోయే ప్రతి ప్రేక్షకుడుకి కనిపించి తీరుతుందని దిల్ రాజ్ అభిప్రాయ పడుతున్నారు.
‘పుష్ప 2’ కలక్షన్స్ హవా ఇప్పటికీ ఉత్తర భారతంలో కొనసాగుతున్న నేపధ్యంలో ఇప్పటికే ‘పుష్ప 2’ ‘బాహుబలి 2’ రికార్డులను బ్రేక్ చేసిన నేపధ్యంలో ‘గేమ్ ఛేంజర్’ మూవీ పై భారీ టార్గెట్ ఏర్పడింది. దీనితో ఈమూవీ ఉత్తరాదిలో కలక్షన్స్ హవా క్రియేట్ చేయవలసిన పరిస్థితి ఏర్పడింది. ఇలాంటి పరిస్థితులలో ఈమూవీకి టోటల్ పాజిటివ్ టాక్ రాకపోతే కలక్షన్స్ రికార్డుల విషయంలో ఈమూవీకి ఎదురీత తప్పదు అన్న అభిప్రాయం కొందరిలో ఉంది..