HMPV: వైరస్ అంటే ఏమిటి.. కరోనా కంటే ప్రమాదమా..?

Divya
•కరోనా తర్వాత మళ్లీ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్న హెచ్ఎంపీవీ వైరస్..
•ఐదు సంవత్సరాల లోపు  పిల్లలు జాగ్రత్త పడాల్సిందే..
•కరోనా అంత ప్రమాదమేమీ కాదంటున్న వైద్యులు.

2025 కొత్త ఏడాది మొదలైనప్పటి నుంచి ప్రజలందరినీ కూడా భయభ్రాంతులకు గురి చేస్తున్న వైరస్ HMPV .. ఈ వైరస్ ను "హ్యూమన్ మెటాప్ న్యూమో వైరస్" అని పిలుస్తూ ఉంటారు.. ఈ వైరస్ 2001లో నెదర్లాండ్ లో గుర్తించారట. అయితే ఇది జన్యు కణాలైనా RNA కు తప్పుడు సంకేతాలను ఇచ్చేలా చేస్తుందట. దీనివల్ల మానవుని శరీరంలో శ్వాస కోస వ్యాధులు కూడా తలెత్తుతాయట. ఈ వైరస్ ఎక్కువగా 5 ఏళ్ల పిల్లలకు 12 నెలల లోపు పిల్లలకు మాత్రమే ఎక్కువగా సోకుతుందట. దీని లక్షణాలు దగ్గు, జలుబు వంటివి ఎక్కువగా కనిపిస్తాయని వైద్యులు సైతం తెలియజేస్తున్నారు. అయితే ఈ వైరస్ కరోనా వైరస్ కంటే ప్రమాదమా అనే విషయం ఇప్పుడు ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తోంది.  వాటి గురించి పూర్తిగా చూద్దాం.

2020లో కరోనా వైరస్ ఒక్కసారిగా ప్రజలను భయభ్రాంతులకు గురిచేసింది.  దీనివల్ల చాలామంది కుటుంబ సభ్యులను కోల్పోవడమే కాకుండా ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నారు.  ఇప్పటికీ వీటినుంచి తేరుకోవడానికి ప్రజలకు చాలా సమయం పడుతోంది. ఇలాంటి సమయంలోనే ఇప్పుడు HMPV వైరస్ రావడంతో మరింత భయభ్రాంతులకు గురవుతున్నారు. అయితే ఈ వైరస్ గత కొన్నేళ్లుగా చాలా దేశాలలో ఉందని హైదరాబాదులో అపోలో వైద్యుడు సుధీర్ కుమార్ వెల్లడించారు.

అయితే ప్రజలు భయపడాల్సిన పనిలేదని,  ఈ వైరస్ కరోనా లాంటిది కాదు అని.. సాధారణంగా 5 ఏళ్ల కంటే తక్కువ వయసు ఉన్న వారిలో లేకపోతే వృద్ధులలో రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్న వారిలో మాత్రమే HMPV వైరస్ వ్యాప్తి చెందుతుంది అంటూ తెలియజేశారు. ఈ వైరస్ సోకిన వారికి నాలుగు నుంచి ఏడు రోజులలోపే కోలుకుంటారనే విధంగా తెలియజేశారు. HMPV వైరస్ కరోనా వైరస్ కంటే ప్రమాదం ఏమి కాదు అంటూ తెలియజేశారు. ఏది ఏమైనా ప్రజలు మాత్రం మాస్కులు పెట్టుకొని జాగ్రత్తగా ఉండాలంటూ వైద్యులు సైతం సూచిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: