పవన్ వ్యాఖ్యలకు అజ్ఞాతవాసి కి టెన్షన్ !

Seetha Sailaja
‘బాహుబలి’ రికార్డుల కలక్షన్స్ తరువాత రెండవ స్థానంలో నిలుస్తుందని ఆసపడుతూ పవన్ ‘అజ్ఞాతవాసి’ ని అత్యంత భారీ స్థాయి మొత్తాలకు కొనుక్కున్న విషయం తెలిసిందే. ఈమూవీ బయ్యర్లకు ప్రస్తుతం గత మూడు రోజులుగా సుడిగాలిలా పర్యటిస్తూ ఆంధ్రప్రదేశ్ జిల్లాలలో పవన్ చేసిన ఆవేసపూరితమైన కామెంట్స్ విని ‘అజ్ఞాతవాసి’ బయ్యర్లు టెన్షన్ పడిపోతున్నట్లు టాక్. 

ఎవరో చేసిన తప్పుకు మరెవ్వరో శిక్ష అనుభవిస్తున్నట్లుగా పవన్ వాడిన మాటల తూటాలు ‘అజ్ఞాతవాసి’ కి సమస్యగా మారుతాయని ఈసినిమా బయ్యర్ల ప్రస్తుత భయం. ఈసినిమా విడుదలవుతున్న జనవరి 10వ తారీఖు నుండి జనవరి 18 వరకు ఈసినిమా టిక్కెట్లను యూనిఫార్మ్  రేటు 200 అమ్మేసుకోవచ్చని అదేవిధంగా చిన్న సెంటర్లలో 100కు అమ్మేసుకోవచ్చని బయ్యర్లు ఆశపడుతూ ఇంత భారీ మొత్తాలకు కొన్నారు.

అదేవిధంగా జనవరి 9వ తారీఖు రాత్రి స్పెషల్ షోలను వేసి మరింత భారీ మొత్తాలకు టిక్కెట్లను అమ్ముకోవాలని ‘అజ్ఞాతవాసి’ బయ్యర్లు ఇప్పటికే మాష్టర్ స్కెచ్ వేసుకున్నారు. అయితే ఇలాంటి విషయాలకు ప్రభుత్వ సహాయ సహకారాలు కావాలి. ఒకవైపు పవన్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సారధి చంద్రబాబును ఇరుకున పెట్టే కామెంట్స్ ను చేస్తున్న నేపధ్యంలో ‘అజ్ఞాతవాసి’ రెట్ల పెంపుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సహకరిస్తుందా అన్న అనుమానాలు బయ్యర్లకు వస్తున్నాయి అని అంటున్నారు.

ధీనికితోడు పవన్ అల్లుఅరవింద్ ను డైరెక్ట్ గా టార్గెట్ చేస్తూ కామెంట్స్ చేసిన నేపధ్యంలో ఇప్పటికే పవన్ అల్లుఅర్జున్ ల మధ్య గ్యాప్ ఏర్పడిన నేపధ్యంలో ఈవిషయాన్ని ఆశరాగా తీసుకుని బన్నీ అభిమానులు ‘అజ్ఞాతవాసి’ పై నెగిటివ్ టాక్ మొదటి రోజునుండి ప్రచారంలోకి తీసుకు వస్తే పరిస్థితి ఏమిటి అన్న భయం కూడ ప్రస్తుతం ‘అజ్ఞాతవాసి’ బయ్యర్లను వెంటాడుతున్నట్లు టాక్. ఇలా అనేకరకాల కారణాలు మహాభారతంలో కర్ణుడు పతనానికి సహకరించినట్లుగా పవన్ ఆవేశంగా చేసిన కామెంట్స్ ‘అజ్ఞాతవాసి’ కి సమస్యగా మారుతాయా అన్న టెన్షన్ తో ఈసినిమా బయ్యర్లు ప్రస్తుతం భయంతో కాలం గడుపుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి..


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: