కళ్యాణ్ రామ్ వివాదాస్పద ఎంపిక పై షాకింగ్ న్యూస్ !

Seetha Sailaja
‘పటాస్’ ఘన విజయం కళ్యాణ్ రామ్ కు మంచి జోష్ ను ఇచ్చినా ఆ తరువాత అతడు ఎన్నో ఆశలు పెట్టుకుని నిర్మించిన ‘ఇజం’ ఫెయిల్ అవ్వడంతో తన సినిమాల ఎంపిక పై కళ్యాణ్ రామ్ చాల జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ఇలాంటి పరిస్థుతులలో కళ్యాణ్ రామ్ లేటెస్ట్ గా తీసుకున్న ఒక షాకింగ్ నిర్ణయం చాలామందిని ఆశ్చర్య పరుస్తోంది. మలయాళ నటి భావన కిడ్నాప్ కేసులో ప్రముఖ మలయాళ నటుడు దిలీప్ అరెస్టయిన రెండు నెలల తర్వాత బెయిలు పై విడుదలైన సంగతి తెలిసిందే. 

సినీ ఫక్కీలో జరిగిన ఈ కిడ్నాప్ కేసులో దిలీప్ పేరు రావడం మాలీవుడ్ తో పాటు దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. అయితే దిలీప్ అరెస్టయిన సమయంలోనే అతడు రాజకీయ నేపథ్యంలో నటించిన `రామ్ లీలా` సినిమా విడుదలకు రకరకాల కారణాల వల్ల అనేక ఆటంకాలు ఏర్పడ్డాయి. ఆతరువాత ఎట్టకేలకు  ఆ చిత్రం విడుదలై ఘనవిజయం సాధించింది. పొలిటికల్ కమ్ క్రైం థ్రిల్లర్ గా తీసిన ఈ చిత్రంలో దిలీప్ ఓ ఎమ్మెల్యే పాత్రలో నటించాడు. 

అయితే ఆసినిమా కథలో దిలీప్ పాత్రకు వేరే ఎమ్మెల్యే హత్య కేసులో పాత్ర ఉంది అన్న ఆరోపణల నేపథ్యంలో రాజకీయ పార్టీ అతడిని సస్పెండ్ చేస్తుంది. మొత్తం అంత రాజకీయ నేపధ్యంలో జరిగే ఈ మూవీ ఒక పొలిటికల్ థ్రిల్లర్ మూవీని చూస్తున్నట్లు అనిపిస్తుంది. ఈమూవీ మలయాళంలో సూపర్ హిట్ అయి దిలీప్ కు ఎంతో పేరు తీసుకు వచ్చింది. ఇప్పుడు ఈసినిమా పై కళ్యాణ్ రామ్ కన్ను పడినట్లుగా తెలుస్తోంది. 

`రామ్ లీలా` తెలుగు రీమేక్ హక్కులను ఒక టాలీవుడ్ నిర్మాత కొనుక్కున్నాడు. ఈ మూవీని రీమేక్ చేయడానికి ఆ నిర్మాత రానాను అదేవిధంగా రవితేజాను సంప్రదిస్తే పెద్దగా ఫలితం రాలేదని టాక్. ఈ విషయాలను తెలుసుకున్న కళ్యాణ్ రామ్ తాను ‘రామ్ లీలా’ నటిస్తానని ఆ నిర్మాతకు ఓపెన్ ఆఫర్ ఇవ్వడమే కాకుండా ఆ సినిమాలో తాను నిర్మాణ భాగస్వామిని అవుతానని సంకేతాలు ఇచ్చినట్లు టాక్.  రాబోయే ఎన్నికల నేపథ్యంలో ఈ చిత్రాన్ని టీడీపీ తరపున ప్రచారానికి వాడుకోవచ్చని కల్యాణ్ రామ్ ఆలోచన అని తెలుస్తోంది. ఈవిధంగా రాబోయే ఎన్నికలలో కళ్యాణ్ రామ్ కూడ తెలుగుదేశ విజయానికి తన వంతు సహాయసహకారాలు అందిస్తున్నాడు అనుకోవాలి..  


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: