షాకింగ్ ట్రయల్ షూట్ ప్రయోగాల మధ్య చిరంజీవి !

Seetha Sailaja
150 సినిమాలలో నటించి మెగాస్టార్ గా కోట్లాదిమంది అభిమానులను పొందిన చిరంజీవి నటించే సినిమాలో కొత్తవారి పై తీస్తున్నట్లుగా ఒక ట్రయల్ షూట్ తీస్తున్నారు అంటే అది ఎవరూ నమ్మరు. అయితే ‘సైరా’ సినిమా షూటింగ్ లో ఇటువంటి ప్రయోగం జరగబోతోంది అన్నవార్తలు వస్తున్నాయి. ఆశ్చర్యాన్ని కలిగించే ఈన్యూస్ వివరాలలోకి వెళితే కొన్ని షాకింగ్ వార్తలు బయటకువస్తున్నాయి. మెగాభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ‘సైరా’ షూటింగ్ డిసెంబర్ 6న ప్రారంభమవుతోంది. 

ఇందుకోసం అల్యూమినియం ఫ్యాక్టరీలో భారీ సెట్ వేసారు. ఈ షూట్ కోసం సుమారు వందమంది విదేశీ జూనియర్ ఆర్టిస్టులను సమీకరిస్తున్నారు అని టాక్. అయితే ఈమూవీ షూటింగ్ డిసెంబర్ 6 నుంచి ప్రారంభం అయినా ఒకపదిరోజులు వరసగా ఆసినిమా షూట్ చేసి ఆతరువాత ఆమూవీ షూటింగ్ ను ఆపేసి పూర్తిగా ఆషూటింగ్ ఫుటేజ్ పరిశీలిస్తారట. అంతేకాదు మెగాస్టార్ చిరంజీవి గెటప్ అన్నివిధాలా సరిపోయిందా లేదా అన్న దానిపై కూడ డిఫరెంట్ ఒపీనియన్లు చిరంజీవి సన్నిహితులు కొంతమంది ప్రముఖ దర్శకులకు చూపెట్టి అన్నివిధాల సంతృప్తి కలిగితేనే తిరిగి షూటింగ్ మళ్ళీ రీ స్టార్ట్ చేస్తారని టాక్. 

లేదంటే ఆ ఫుటేజ్ అంతా పక్కనపడేసి చిరంజీవి గెటప్ లో  కావాల్సిన ఛేంజెస్ చేసి మళ్లీ స్టార్ట్ చేస్తారని వార్తలు గాసిప్పులుగా హడావిడి చేస్తున్నాయి. ఈవార్తలలో ఎన్నినిజాలో తెలియకపోయినా ఈవార్తలే నిజం అయితే ఒకవిధంగా మెగాస్టార్ చిరంజీవికి ఇది రియల్ రిహార్సల్ షూట్ అనుకోవాలి. ఇది ఇలా ఉండగా ఈసినిమా షూటింగ్ ప్రారంభం ఒకభారీ ఫైట్ సీన్ తో ప్రారంభం అవుతోంది కాబట్టి డూప్ లు లేకుండా భారీ ఫైట్స్ చేస్తున్న చిరంజీవికి ఎటువంటి సమస్యా లేకుండా కొంతమంది నిష్ణాతులైన విదేశీ ఫైట్ ట్రైనర్స్ ను రంగంలోకి దింపి ఈ ఫైట్స్ కంపోజ్ చేయిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. 

దీనికితోడు ప్రముఖ అమెజాన్ సంస్థ ‘సైరా’ సినిమా షూటింగ్ మేకింగ్ విడియోలను తమద్వారా విడుదల చేయడానికి తన ఎక్విప్ మెంట్ తన సిబ్బందితో ఏర్పాటు చేస్తోందని అంటున్నారు. ఇలా అమెజాన్ ఈసినిమా మేకింగ్ వీడియోలను తయారు చేసినందుకుకాను కోట్ల రూపాయల పారితోషికాన్ని ఇచ్చే విధంగా ఈసినిమాను నిర్మిస్తున్న మెగా క్యాంప్ అమెజాన్ ల మధ్య ఒక ఒప్పందం కూడ కుదిరింది అన్న వార్తలు ఇప్పటికే ఉన్నాయి..   


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: