నారా రోహిత్ జై బాలయ్య టచ్ వెనుక ఆంతర్యం !

Seetha Sailaja
వరస పరాజయాలతో సతమతమైపోతున్న నారా రోహిత్ తన ఫెయిల్యూర్స్ ను లెక్కచేయకుండా వరసపెట్టి సినిమాలు చేస్తూ తన కెరియర్ లో సెటిల్ కావడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాడు. లేటెస్ట్ గా ఈ యంగ్ హీరో నటిస్తున్న ‘బాలకృష్ణుడు’ ఆడియో ఫంక్షన్ లో ఈ నారా వారి అబ్బాయి చేసిన స్లోగన్ చాలామంది దృష్టిని ఆకర్షించింది. ఈమధ్య ఈ యంగ్ హీరో మాటల్లో మెచ్యూరిటీ కనిపిస్తున్న విషయంలో ఆ ఆడియో ఫంక్షన్ లో నారా రోహిత్ చేసిన స్పీచ్ చాలామందిని ఆశ్చర్య పరిచింది.  

అందరికీ నమస్కారం అంటూ తన స్పీచ్ స్టార్ట్ చేసిన నారా రోహిత్ ఆడియో ఫంక్షన్ కి విచ్చేసిన సమంత గారికి సాయి ధరమ్ తేజ్ కు నాగ శౌర్యకు కృతజ్ఞతలు అంటూ ఈసినిమాలో తన లుక్ మార్చుకోవడం కోసం తాను పడ్డ కష్టాన్ని వివరించాడు. ఇదే సందర్భంలో నారా రోహిత్ మాట్లాడుతూ  తనకంటే తన సినిమా చూసిన వారు ఎక్కువగా మాట్లాడాలని కోరుకుంటున్నాను అంటూ మరో ట్విస్ట్ ఇచ్చాడు. 

ఇదే సందర్భంలో తాను నందమూరి ఫ్యామిలీలోని అన్ని వర్గాలకు చెందిన వ్యక్తిని అని అంటూ సంకేతాలు కూడ ఇచ్చాడు. ‘ఈ కార్యక్రమానికి బాలకృష్ణ అభిమానులు నందమూరి అభిమానులు తారక్ అభిమానులు అందరూ వచ్చారు మనమంతా ఒకే కుటుంబం జై బాలయ్య’ అంటూ ఫినిషింగ్ టచ్ ఇచ్చాడు. ఇప్పుడు ఈ వ్యూహమే నారా రోహిత్ ను నందమూరి అభిమానులకు మరింత దగ్గరకు చేర్చింది అని అంటున్నారు. 

నందమూరి అభిమానులు బాలకృష్ణ జూనియర్ వర్గాలుగా మారిన నేపధ్యంలో మనమంతా ఒకటే కుటుంబం అని నారా రోహిత్ వ్యూహాత్మకంగా చేసిన కామెంట్స్ వెనుక ఎప్పటికైనా బాలయ్యా జూనియర్ లు కలిసిపోతారు అన్న సంకేతాలు ఇస్తున్నట్లు ఉందని ఈ ఆడియో ఫంక్షన్ కు వచ్చిన చాలామంది కామెంట్స్ చేసుకున్నట్లు టాక్. త్వరలో విడుదల కాబోతున్న ఈమూవీ కూడ సక్సస్ కాకపోతే నారా రోహిత్ కెరియర్ మరింత సమస్యల మధ్య చిక్కుకునే ఆస్కారం ఉంది..


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: