హీరో నితిన్ ను ఫాలో అవుతున్న నిఖిల్...

K Prakesh

టాలీవుడ్ యంగ్ హీరోలలో పవన్ కళ్యాణ్ ను జపించడం ఎక్కువైపోతోంది. పవన్ సినిమా పాటలు సినిమా టైటిల్స్ గా పెట్టుకుని సూపర్ హిట్ కొట్టిన హీరో నితిన్ ను అనుసరిస్తూ చాలా మంది జూనియర్  హీరోలు ఈ పవనిజం పొగడ్తల కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. మొదటిగా ఈ కార్యక్రమాన్ని హీరో నితిన్ మొదలు పెడితే, ఆ తరువాత హీరో నవదీప్ అందుకున్నాడు. ఇంత మంది భజన చేస్తుంటే తనెందుకు చేయకూడదు అనుకున్నాడు కాబోలు కొత్తగా ఈ జాబితాలోకి హీరో నిఖిల్ కూడా చేరిపోయాడు. ఈ మధ్య నిఖిల్ తాను నటిస్తున్న ‘కార్తికేయ’ సినిమా సెట్ లో ఒక ఆసక్తికరమైన చర్చ పదిమంది యువకుల మధ్య జరిగిందని చెపుతున్నాడు.

ఇంతకీ ఆచర్చ ఏమిటంటే మన టాలీవుడ్ లో రజినీకాంత్ స్థాయిని అందుకోగల హీరో ఎవరు? అనే టాపిక్ పై చర్చ అట. ఈ చర్చలో కల్పించుకున్న నిఖిల్ పవన్ అనే శబ్దం లో ఒక మేజిక్ ఉందనీ అందుకే ప్రస్తుతం టాలీవుడ్ లో పవనిజం అంత పీక్ స్థాయిలో ఉందని ఆవేశంగా లెక్చర్ ఇచ్చాడట. అంతేకాదు ఎప్పటికైనా టాలీవుడ్ లో రజినీకాంత్ స్థాయిని అందుకోగల ఏకైక నటుడు పవన్ కళ్యాణ్ మాత్రమే అంటూ సర్టిఫికేట్ కూడా ఇచ్చేసాడట. ఆ సెట్ లో ఈ ఉపన్యాసం విన్న చాలామంది హీరో నిఖిల్ కూడా హీరో నితిన్ సెంటిమెంట్ ను ఫాలో అవుతూ తన సినిమాలు కూడా సూపర్ హిట్ చేసుకోవడానికి ఇలా మాట్లాడుతున్నాడు అంటు జోక్స్ వేసారట.

దీనిని బట్టీ చూస్తే పవన్ కళ్యాణ్ కు భజన చేసే ఒక జూనియర్ హీరోల బ్యాచ్ టాలీవుడ్ లో ఏర్పడింది అనుకోవాలి. గతంలో చిరంజీవి మెగాస్టార్ గా వెలుగుతున్న రోజులలో ఇలాగే ఓ భజన సంఘo శ్రీకాంత్, ప్రభుదేవా, తరుణ్ లతో  ఏర్పడి వారి శక్తి మేరకు భజన చేస్తూ అవకాశాలు కొట్టేసేవారు. ఇప్పుడిదే ట్రెండ్ నిఖిల్ పాటిస్తున్నాడు అనుకోవాలి.... 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: