నేడు "స్పైడర్" మహేష్ బాబు బర్త్-డే : జన్మదిన శుభాకాంక్షలు

"అతడు" తలుచుకోగానే స్పురించే 6 అడుగుల రెండంగుళాల స్పురదౄపం. తొమ్మిది ఆగష్ట్ 1975 అతని పుట్టినరోజు నేటికి 41 వసంతాల వసంతుడే అతడు. ఒక తరాన్ని సాహస చిత్రాలతో ఏ సాంకేతికతనైనా తెలుగు చిత్రరంగానికి తొలిసారి పరిచయం చేసే నవనవోన్వెషిత విప్లవ, సాహసనటుడు నటశేఖర ఘట్టమనేని కృష్ణ ఇందిర దంపతుల ప్రియ పుత్రుడు. అందం, అద్భుతమైన బిల్ట్, తెజస్సు స్పురించే కళ్ళు, చక్కని మిల్కీ కలర్, 41 టర్నైనా హాండ్-సం లుక్ తో మిల్కీ బొయ్ అంటే కాదనే వారే ఉండరు.



ఆ అతడెవరో ఈ పాటికే అందరికి తెలుసు సూపర్-స్టార్ మహేష్ బాబు. బాలనటుడుగా 9 చిత్రాల్లో నటించిన నాడే "పువ్వుపుట్టగానే పరిమళించు" అన్న సామెతను నిజం చేసిన అతను కథానాయకుడుగా చిత్ర రంగ ప్రవేశం చేసిన తొలిచిత్రం 1999 లో రాఘవేంద్రుని దర్శకత్వం లో "రాజకుమారుడు" దానికి బంగారు నంది అవార్డ్ వచ్చింది కూడా. అందుకే ఈనాటికి "ప్రిన్స్" గానే అభిమానులు ముద్దుగా పిలుచుకుంటారు ప్రత్యేకించి అమ్మాయిలు. ఇప్పటికి 18 సంవత్సరాలలో విడుదలకు సిద్ధమౌతున్న రెండు సినిమాలు కలుపుకొని 25 సినిమాల్లో కథానాయకుడుగా నటించారు.



ఏడు సినిమాలకు నంది అవార్డ్స్ రాగా, 3 సినిమాలకు సైమా, 5 సినిమాలకు ఫిల్మ్-ఫేర్, ఒక ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అవార్డ్స్ అతడు స్వంతం చేసుకోవటం తో సూపర్ స్టార్ కొడుకు గా సూపర్ స్టార్ పేరు నిలబెట్టి తంద్రిని మించిన కొడుకయ్యాడు. 25 సినిమాల్లో 19 మంది డిఫరెంట్ దర్శకులకు పనిచేయటం అతని లోని "వివిడిటి" కి ప్రాణం పోసింది. నిత్య నూతనత్వమే అతని సినిమాల సృజనాత్మకత. 




జన్మదిన శుభాకాంక్షలతో ప్రిన్స్ తన  అభిమానులకు మరో గిఫ్ట్ పుట్టినరోజు సందర్భంగా బుధవారం ఉదయం "స్పైడర్" రెండో టీజర్‌ను విడుదల చేశారు. ప్రస్తుతం "స్పైడర్" యూట్యూబ్‌లో అతడు హల్‌చల్ చేస్తున్నాడు. తొలి టీజర్‌లో ఎలాంటి డైలాగులు లేకుండా కేవలం మహేష్ లుక్‌ను మాత్రమే చూపించారు. ఈ రెండో టీజర్‌లో మాత్రం డైలాగులతో సహా మరిన్ని పాత్రలను పరిచయం చేశారు. సెన్సేషనల్ డైరెక్టర్ ఎ.ఆర్.మురుగదాస్ దీని దర్శకుడు. కొన్ని రోజుల క్రితం రిలీజ్‌ చేసిన టీజర్‌కు అద్భుతమైన రెస్పాన్స్‌ వచ్చిన విషయం తెలిసిందే. ఎన్వీ ప్రసాద్‌ మాట్లాడుతూ– "ఒక్క పాట మినహా షూటింగ్‌ పూర్తయింది. ఈ నెల 23 వరకు పాట షూటింగ్‌ జరుగుతుంది. దీంతో షూటింగ్‌ పూర్తవుతుంది. మరోవెపు డబ్బింగ్, రీ–రికార్డింగ్‌ కార్యక్రమాలు జరుపుతున్నాం. దసరా కానుకగా సెప్టెంబర్‌ 27న తెలుగు, తమిళ భాషల్లో ఈ సినిమాను విడుదల చేస్తాం"  అన్నారు.




అభిమాన కథానాయికలు శ్రీదేవి త్రిషలు అంటెన్ ఎంత ఇష్టమో బిరియానీ కాఫీలన్నా అంతే ఇష్టపడే అతనికి తన కిడ్స్ సితారా, గౌతం లతో వీకెండ్స్ లో ఆడుకోవటం అంటే చాలా ఇష్టం. ఏమాత్రం సినీ నటీమణులతో వివాదాస్పదం కాని ఇతనికి ప్రాణం  అర్ధాంగి నమ్రత.  జన్మదినోత్సవం సందర్భంగా మహేష్ బాబుకు ఇండియా హెరాల్ద్ జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతుంది.


 
     

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: