టాలీవుడ్ టాప్ హీరోయిన్ గా ప్రస్తుతం తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ని ఏర్పరచుకున్న రకుల్ ప్రీత్ పంజాబీ అమ్మాయి అయినా తెలుగు అమ్మాయిల కంటే స్పష్టంగా తెలుగు మాట్లాడుతుంది. తన మనసులోని భావాలను ఏమాత్రం దాచి పెట్టుకోకుండా కుండబద్దలు కొట్టినట్లు మాట్లాడుతుంది అని పేరున్న ఈమె నిన్న ఒక ప్రముఖ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత విషయాల గురించి అదేవిధంగా పబ్ లు గాసిప్స్ లాంటి అనేక విషయాల గురించి ఎన్నో ఆసక్తికర విషయాలను షేర్ చేసింది రకుల్.
వాస్తవానికి తాను ఒక కారు కొనుక్కుందామని సినిమా ఇండస్ట్రీలోకి వచ్చిన విషయాన్ని బయట పెడుతూ తాను ఈ రేంజ్ ఉన్న హీరోయిన్ గా ఎదుగుతానని తాను కలలో కూడా అనుకోలేదు అంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది. ఇదే సందర్భంలో తన గ్లామర్ సీక్రెట్ ను బయట పెడుతూ తమకు నిర్మాతలు భారీగా పారితోషికాలు ఇస్తారు అని ప్రచారంలో ఉన్న వార్తల గురించి మాట్లాడుతూ తనకు సినిమాలలో నటించినందు వల్ల వచ్చే డబ్బులో సగ భాగం తన స్టాఫ్ జీతాలు తన గ్లామర్ మెయిన్ టైనన్స్ కోసం ఖర్చు అయిపోతుందని తాను గ్లామర్ గా కనిపించడం కోసం ఖర్చు పెట్టె డబ్బుకు సంబంధించిన బిల్స్ చూస్తే ఎవరైనా షాక్ అవుతారు అంటూ మరో ట్విస్ట్ ఇచ్చింది.
అంతేకాదు తన ఐబ్రోస్ దగ్గర నుంచి ఇలా ప్రతి విషయం చాల జాగ్రత్తగా చూసుకోవాలని తమ నటన గ్లామర్ తో సినిమాలలో నటించే తమకు ఇచ్చే పారితోషికం కన్నా హీరోలకు ఇచ్చే పారితోషికం చాల భారీ స్థాయిలో ఉంటుంది కదా అంటూ హీరోలపై సెటైర్లు వేసింది రకుల్. అయితే తాను ఈసినిమా కెరియర్ ను శాస్వతం అనుకోనని అందువల్లనే తాను హైదరాబాద్ లో త్వరలో ఒక మంచి రెస్టారెంట్ ను కూడ ఓపెన్ చేయబోతున్నట్లు లీకులు ఇస్తోంది రకుల్.
తన రెస్టారెంట్ లో తిని తన జిమ్ కు వెళ్ళి అమ్మాయిలు అబ్బాయిలు వర్కౌట్ చేసే రోజులు దగ్గరలోనే ఉన్నాయి అంటూ తనలోని బిజినెస్ ఉమెన్ ను బయట పెట్టింది రకుల్. ఇదే సందర్భంలో ఆమె తనపై గాసిప్పులు ప్రచారం చేసే వ్యక్తుల గురించి మాట్లాడుతూ తన గురించి గాసిప్పులు వ్రాయడం మానుకుని ఆ గాసిప్పులు వ్రాసేవాళ్ళు తమ కెరియర్ పై దృష్టి పెడితే మంచి రచయితలుగా మారుతారు కదా అంటూ జోక్ చేసింది రకుల్..