నిర్మాత సురేష్ పై నటి సంచలన వ్యాఖ్యలు..!

Edari Rama Krishna
సినిమా ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఎంతో భవిష్యత్ ఊహించుకుంటారు హీరోయిన్లు.  ఇండస్ట్రీలో ఒక్క చాన్స్ దొరికితే చాలు తమ అదృష్టం అనుకునే ఈ రోజుల్లో లఘు చిత్రాలు, బుల్లితెర, వెండితెరపై తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నది హీరోయిన్ అవంతిక తన భవిష్యత్ తో ఆడుకుంటున్నాడని నిర్మాత సురేష్ పై సంచలన ఆరోపణలు చేసింది.   గ్లామర్ పరిశ్రమలో తనకు జరిగిన అన్యాయం పై ఈమె గొంతు విప్పింది.   సినిమా నిర్మాత సురేష్ పై నటి అవంతిక శేట్టి చేసిన ఆరోపణలు పరిశ్రమలో సంచనలం రేపుతున్నాయి.

 ఈ మద్య తన గురించి  అవాస్తవాలను పత్రికలో నిర్మాత సురేష్ రాయించాడని, తన ప్రతిష్టకు భంగం కలిగేలా ఉండడంతో ఆందోళన చెందాల్సి వచ్చిందని ట్విట్టర్ లో రాసుకొచ్చింది అవంతిక.  అంతే కాదు గత కొంత కాలంగా తనను అదే పనిగా వేధిస్తున్నాడని తన కెరీర్ కి ముప్పు కలిగించేలా నిర్మాత వ్యవహరించాడని, పెర్ఫార్మెన్స్ బాగాలేదని అందరితో చెబుతూ.. ఇండస్ట్రీలో తనను అవమాన పరుస్తున్నాడని ఆరోపించింది.  రాజు కన్నడ మీడియం తోలి షెడ్యుల్ నుంచే కష్టాలు ప్రారంభం అయ్యాయని, మంచి నటనను ఇచ్చేందుకు కష్టపడ్డానని, బ్యాంకాక్ లో తనతో దారుణంగా ప్రవర్తించాడని గుర్తు చేసింది.

దీనికి కారణం ఆయన ఇచ్చిన చెక్కులు బౌన్స్ అయ్యాయని ఇందేంటని ప్రశ్నించినందుకు తనపై కక్ష్య తీర్చుకుంటున్నాడని ఆరోపించింది. నటిస్తున్న మూవీకి ఇప్పటివరకు చెల్లించాల్సిన బకాయిలు ఇవ్వలేదని, తనతో డబ్బింగ్ చెప్పకుండానే సినిమాని రిలీజ్ చేయాలని చూశారని ఆరోపించింది. చేసిన మోసంపై కోర్టులో పిటిషన్ వేసినట్టు తెలియజేసింది. 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: