హాట్ టాపిక్ గా మారిన ప్రభాస్ గేమ్ !

Seetha Sailaja
టాప్ హీరోలతో ఫొటోలు తీసుకుని వాటిని తమ పేస్ బుక్ లో పెట్టుకుని మురిసి పోయే అభిమానుల హడావిడి తెలిసిందే. ఒక టాప్ హీరోతో ఫోటో తీయించుకునే ఛాన్స్ వస్తే చాలు అది వారి జీవితాలను మలుపు తిప్పే సంఘటనగా నేడు చాలా మంది భావిస్తున్నారు. ఈ ఫోటోల మ్యానియా తట్టుకోలేక సూపర్ స్టార్ రజనీకాంత్  తన అభిమానులతో ఒక్కొక్కరితో ఫొటోదిగడం లాంటి విషయాలు చేయలేక తానూ నిర్వహిద్దాము అనుకున్నతన  అభిమానుల  సమావేశాన్ని కూడ రద్దు చేసుకున్న విషయం  తెలిసిందే. 

ఇది ఇలా ఉండగా ప్రస్తుతం టాప్ హీరోలకు తమ ఫ్యాన్స్ బెడదకన్నా మీడియా బెడద ఎక్కువగా పెరిగిపోయింది అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి.  టాప్ హీరోలు ప్రెస్ మీట్ పెట్టడం అక్కడ ప్రెస్ మీట్ లో మాట్లాడేది పావుగంట అయితే అక్కడి  జనాలతో ఫొటో సెషన్ గంట అన్నట్లు పరిస్థితులు తయారు అయ్యాయి అన్న మాటలు వినిపిస్తున్నాయి.

ఆ మధ్య ఓసారి ఎన్టీఆర్ ప్రెస్ మీట్ పెడితే ఇలాగే జరిగింది. సెల్ఫీలు, ఫోటోలు అంటూ గంటల కొద్దీ అక్కడ జనాలు టైం తీసుకోవడం తో  మీడియా వర్గాల  అత్యుత్సాహానికి జూనియర్ కూడ షాక్ అయినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. 

అటువంటి పరిస్థుతులు నిన్న ప్రభాస్ కు ఎదురు అయినట్లు వార్తలు వస్తున్నాయి. బాహుబలి ప్రమోషన్లలలో భాగంగా ప్రెస్ మీట్ పెట్టారు. మీడియా జనాలతో పాటు మీడియాకు సంబంధంలేని వారు కూడా ఆ సమావేశానికి లోపలికి రావడంతో ప్రభాస్ షాక్ అయినట్లు టాక్. కొంతమంది మీడియా వర్గాలు  ఈ ప్రెస్ మీట్ కు తమ చుట్టాలను స్నేహితులను కుడా తీసుకు వచ్చారని తెలుస్తోంది. 

ఈ మీడియా సమావేశానికి వచ్చిన చాలామంది ప్రభాస్ తో  చాలా మంది ఫొటోలు  తీయించు కోవాలి అని తహ తహ లాడటంతో  నేను ముందంటే నేను ముందంటూ మీదకు వచ్చేపరిస్థితి ఏర్పడంతో  షాక్ అయిన ప్రభాస్ వీలయినంత మందితో ఫోటోలు దిగి, మెల్లగా పక్కకు తప్పుకోవడానికి ఎక్కువసమయమే పట్టింది అన్న వార్తలు వస్తున్నాయి. అంతేకాదు ప్రభాస్ ఆ ప్రస్ మీట్ నుంచి బయటకు వచ్చినా అతడిని వదల కుండా లిఫ్ట్ దాకా కొంత మంది వెనక పరుగులు తీసారు అన్న వార్తలు వస్తున్నాయి.  ఈ తతంగం అంతా చూసిన కొందరు ప్రభాస్ కు ప్రస్తుతం నడుస్తున్న క్రేజ్ పై కామెంట్ చేస్తూ ఇదే పరిస్తి కొనసాగితే  ప్రభాస్ భవిష్యత్ లో ప్రెస్ మీట్ లు కూడా రికార్డు చేసిపంపే రోజులు దగ్గరలోనే ఉన్నాయి అంటూ కామెంట్ చేసుకున్నట్లు టాక్..  


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: