మొదటి మూవీకే రవి రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?
కథ బాగా నచ్ఛటంతో రవి ఈ మూవీలో హీరోగా చేసేందుకు ఒప్పుకున్నారు. ఇదిలా ఉంటే ఈ మూవీకి సంబంధించిన మోషన్ పోస్టర్ తాజాగా రిలీజ్ అయింది. మోషన్ పోస్టర్ ను మెగాస్టార్ చిరంజీవి చేతులు మీదగా రిలీజ్ చేశారు. ఇక ఈ పోస్టర్ ని చూసిన చిరు...చాలా బాగుందని ప్రశంసించారు. చిరు చేతుల మీదగా పోస్టర్ రిలీజ్ కావటంతో హీరోగా రవి ఆనందానికి అంతే లేకుండా పోయింది.
దీంతో చిరుకి వీరు కృతజ్ఞతలు తెలిపారు. ఇక తన మొదటి డెబ్యూ మూవీకి రవి తీసుకునే రెమ్యునరేషన్ ఎంతో తెలిస్తే ఒక్కసారిగా షాక్ అవుతారు. దాదాపు 50 లక్షల వరకూ రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. చిన్న బడ్జెట్ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ మూవీకి హీరో తీసుకుంటున్న రెమ్యునరేషన్ ఈ రేంజ్ లో ఉండటంతో రవికి దాదాపు కమర్షియల్ హీరో స్ట్రాటజీ వచ్చేసినట్టే అని అంటున్నారు.
మరికొందరు మాత్రం రవి ఈ మూవీకి అస్సలు రెమ్యునరేషన్ తీసుకోవటం లేదని అంటున్నప్పటికీ...ఈ వార్తల్లో నిజం ఎక్కడా కనిపించలేదని అంటున్నారు. మొత్తంగా యాంకర్ రవి మొదటి మూవీ రెమ్యునరేషన్ ని తెలుసుకున్న కొందరు పర్వాలేదని అంటున్నారు. ఇక యంగ్ జనరేషన్ జీవితాలను ప్రభావితం చేసే విధంగా ఈ చిత్రం కథ ఉండబోతుందని అంటున్నారు. త్వరలోనే ఈ మూవీ ట్రైలర్ బయటకు రానుందని అంటున్నారు.