మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తాజాగా గేమ్ చేంజర్ అనే సినిమాలో హీరోగా నటించాడు. శంకర్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాను అత్యంత భారీ బడ్జెట్ తో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించాడు. ఈ మూవీ ని ఈ సంవత్సరం జనవరి 10 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల చేయనున్నారు. ఇకపోతే కొన్ని రోజుల క్రితమే అల్లు అర్జున్ హీరో గా సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన పుష్ప పార్ట్ 2 మూవీ విడుదల అయిన విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ కి విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే బ్లాక్ బస్టర్ టాక్ వచ్చింది.
దానితో ఈ సినిమా ఇప్పటికే అదిరిపోయే రేంజ్ కలెక్షన్లను వసూలు చేసి అనేక కొత్త కొత్త రికార్డులను సృష్టించింది. ఈ మూవీ విడుదల అయిన సమయం లోనే 3 గంటల 20 నిమిషాల నిడివితో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా విడుదలకు ముందు ఈ మూవీ రన్ టైమ్ గురించి చాలా మంది మరి ఇంత రన్ టైం చాలా కష్టం. సినిమా ఏ కాస్త తేడా కొట్టిన కూడా ఈ సినిమాకి రన్ టైం ద్వారా కష్టాలు వస్తాయి అని చాలా మంది జనాలు అభిప్రాయాలను వ్యక్తం చేశారు. కానీ ఈ సినిమా మాత్రం భారీ నిడివితోనే బాక్సాఫీసును షేక్ చేసింది. ఇకపోతే ఈ మూవీ బృందం వారు తాజాగా ఓ అప్డేట్ విడుదల చేశారు.
దాని ప్రకారం జనవరి 11 వ తేదీ నుండి ఈ సినిమాకు మరో 20 నిమిషాల నిడివిని యాడ్ చేసి థియేటర్లలో ప్రదర్శించబోతున్నట్లు ఈ మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ఇకపోతే జనవరి 10 వ తేదీన గేమ్ చెంజర్ సినిమా విడుదల కానుంది. 11 వ తేదీ నుండి పుష్ప పార్ట్ 2 సంబంధించిన 20 నిమిషాలు నడిపిన ప్లేస్ చేయనున్నారు. దీనితో గేమ్ చేంజర్ సినిమాకు మంచి టాక్ రాకపోతే పుష్ప 2 కలెక్షన్స్ మళ్లీ పెరిగే అవకాశం ఉంది అని పలువురు అభిప్రాయ పడుతున్నట్లు తెలుస్తుంది.