శంకర్ కెరీర్ ను మలుపుతిప్పిన ఒకే ఒక్కడు.. అలాంటి స్క్రీన్ ప్లే ఊహించలేరుగా!

Reddy P Rajasekhar
టాలీవుడ్, కోలీవుడ్ ఇండస్ట్రీలలో స్టార్ డైరెక్టర్ గా శంకర్ కు ప్రత్యేక గుర్తింపు ఉందనే సంగతి తెలిసిందే. ఒకప్పుడు సౌత్ ఇండియాలో నంబర్ వన్ డైరెక్టర్ ఎవరనే ప్రశ్నకు ఏ మాత్రం తడుముకోకుండా శంకర్ పేరును సమాధానంగా చెప్పవచ్చు. అలాంటి శంకర్ సినీ కెరీర్ ను మలుపు తిప్పిన సినిమా ఏదనే ప్రశ్నకు ఒకే ఒక్కడు సినిమా పేరు జవాబుగా వినిపిస్తుంది. అర్జున్ హీరోగా తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని సొంతం చేసుకుంది.
 
శంకర్ సినీ కెరీర్ గురించి మాట్లాడుకోవాలంటే ఒకే ఒక్కడు ముందు ఒకే ఒక్కడు తర్వాత అని మాట్లాడుకోవాలి. 1999 సంవత్సరంలో విడుదలైన ఈ సినిమా ఇండస్ట్రీని షేక్ చేసింది. ఒక్కరోజు సీఎం కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ సినిమాలో సమాజంలో జరుగుతున్న అవినీతి గురించి ప్రధానంగా ప్రస్తావించారు. మనీషా కొయిరాలా, రఘువరన్ ఈ సినిమాలో ప్రధాన పాత్రల్లో నటించి తమ నటనతో మెప్పించారు.
 
ఈ సినిమలోని స్క్రీన్ ప్లే ఈ జనరేషన్ లో తెరకెక్కుతున్న ఎన్నో సినిమాలకు స్పూర్తి అని చెప్పవచ్చు. శంకర్ టాలెంట్ కు ఒకే ఒక్కడు సినిమా ఒక మచ్చుతునక అని చెప్పడంలో ఎలాంటి సందేహం అవసరం లేదని చెప్పవచ్చు. ఒకే ఒక్కడు సినిమా విడుదలై 25 సంవత్సరాలు అయినా ఈ జనరేషన్ ప్రేక్షకులు సైతం ఈ సినిమాను ఎంతగానో ఇష్టపడతారు.
 
యూట్యూబ్ లో రికార్డ్ స్థాయిలో వ్యూస్ ను సొంతం చేసుకున్న సినిమాలలో ఈ సినిమా ఒకటని చెప్పవచ్చు. శంకర్ తాజా మూవీ గేమ్ ఛేంజర్ లో సైతం ఒకే ఒక్కడు మూవీ పోలికలు ఉన్నాయని కామెంట్లు వినిపిస్తున్నాయి. ఈరోజు గేమ్ ఛేంజర్ మూవీ బుకింగ్స్ మొదలు కానుండగా ఈ సినిమా ఏ స్థాయిలో కలెక్షన్లను సొంతం చేసుకుంటుందో చూడాల్సి ఉంది. ఈ సినిమాకు 250 కోట్ల రూపాయల రేంజ్ లో బిజినెస్ జరిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: