ఆమె కోసం తన పాత్రను వదిలేసుకున్న సమంత.. ఏమైనా ఫలితం ఉందా..?

Pulgam Srinivas
తెలుగు , తమిళ్ ఇండస్ట్రీలలో స్టార్ హీరోయిన్గా కెరియర్ను కొనసాగించిన వారిలో సమంత ఒకరు. ఈ ముద్దుగుమ్మ ఏం మాయ చేసావే అనే సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చి మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని , మంచి గుర్తింపును దక్కించుకుంది. ఆ తర్వాత ఈ బ్యూటీ వరుస పెట్టి స్టార్ హీరోల సినిమాల్లో నటించి చాలా తక్కువ కాలంలోనే తెలుగు సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్ స్థాయికి చేరుకుంది. ఆ తర్వాత ఈమె తమిళ సినిమాల్లో నటించడం మొదలు పెట్టింది.

అందులో భాగంగా ఈమె నటించిన చాలా తమిళ సినిమాలు మంచి విజయాలు సాధించడంతో ఈ బ్యూటీ కోలీవుడ్ ఇండస్ట్రీ లో కూడా స్టార్ హీరోయిన్ స్థాయికి చేరుకుంది. ఇది ఇలా ఉంటే కొన్ని సంవత్సరాల క్రితం ఈ బ్యూటీ తలపతి విజయ్ హీరోగా అట్లీ దర్శకత్వంలో రూపొందిన తేరి అనే తమిళ సినిమాలో హీరోయిన్గా నటించిన విషయం మనకు తెలిసిందే. భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా తమిళ బాక్సా ఫీస్ దగ్గర అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఈ సినిమాను తెలుగులో పోలీసోడు అనే పేరుతో డబ్ చేసి విడుదల చేయగా ఈ మూవీ తెలుగు బాక్సా ఫీస్ దగ్గర కూడా మంచి విజయాన్ని అందుకుంది. ఇకపోతే ఈ సినిమా విడుదల అయిన చాలా సంవత్సరాల తర్వాత ఈ మూవీ ని హిందీ లో వరుణ్ ధావన్ హీరోగా కీర్తి సురేష్ హీరోయిన్గా నిర్మించాడు.

ఈ మూవీ కొన్ని రోజుల క్రితమే విడుదల అయింది. ప్రస్తుతం విజయవంతంగా థియేటర్లో ప్రదర్శించబడుతుంది. ఈ సినిమాతో కీర్తి సురేష్ బాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఇకపోతే కొంత కాలం కీర్తి సురేష్ ఓ ఇంటర్వ్యూలో భాగంగా మాట్లాడుతూ ... ఈ సినిమా హిందీ రీమిక్ లో నన్ను సూచించింది సమంత అని చెప్పుకొచ్చింది. ఇక సమంత తాను తమిళ్ లో చేసిన పాత్రలో హిందీ లో కీర్తి సురేష్ ను రికమెండ్ చేసినట్లు దీనితో అర్థం అవుతుంది. అలా తన పాత్ర కోసం కీర్తి సురేష్ ను సమంత రికమెండ్ చేసినట్లు తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: