పవన్ కళ్యాణ్ మేనత్త నటుడు సురేష్ నిజంగానే ప్రేమించుకున్నారా.. ఇంతకీ సురేష్ చెప్పిన దాంట్లో ఉన్న నిజం ఎంత అనేది ఇప్పుడు చూద్దాం.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మేనత్త అంటే ఆయన సొంత మేనత్త అనుకుంటారు అందరూ. కానీ అలా అనుకుంటే పప్పులో కాలేసినట్టే. ఎందుకంటే పవన్ కళ్యాణ్ మేనత్త అంటే తెరమీద పవన్ కళ్యాణ్ మేనత్త క్యారెక్టర్ లో నటించిన హీరోయిన్ నదియా..అత్తారింటికి దారేది సినిమాలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మేనత్తగా హీరోయిన్ నదియా నటించిన సంగతి మనకు తెలిసిందే. అయితే నదియా ఇప్పుడైతే క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేస్తుంది. కానీ ఒకప్పుడు స్టార్ హీరోయిన్ అనే సంగతి మనకు తెలిసిందే.ఈమె ఎన్నో సినిమాల్లో హీరోయిన్ గా చేసి తన సత్తా చాటింది. అయితే అలాంటి ఈ ముద్దుగుమ్మకి సినిమాలో హీరోయిన్ గా చేసే సమయంలో నటుడు సురేష్ తో ప్రేమలో ఉంది అనే రూమర్స్ వినిపించాయి.
నటుడు సురేష్ అంటే ఎవరో కాదు అమ్మోరు సినిమాలో సౌందర్య భర్తగా నటించిన హీరో.. సురేష్ ఎన్నో సినిమాల్లో హీరోగా మాత్రమే కాకుండా కొన్ని సినిమాలకు నిర్మాతగా.. డైరెక్టర్ గా.. కూడా చేశాడు. అయితే అలాంటి సురేష్ రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ నదియాతో ఉన్న ప్రేమ విషయాన్ని బయట పెట్టారు.చాలామంది నదియాకు నాకు మధ్య ఏదో ఉంది అని ఎఫైర్లు అంటగట్టారు. కానీ అందులో ఎలాంటి నిజం లేదు. నదియాతో నేను సినిమాలు చేసింది నిజమే.కానీ ఆమెతో నాకు అలాంటి రిలేషన్ లేదు. ఆమెని ఎప్పటికీ నేను చెల్లెలిగానే చూస్తాను. ఇక నదియా తో నేను సినిమాలు చేసిన సమయంలో ఆమెకు శిరీష్ అనే బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని తెలుసుకున్నాను.
నదియా షూటింగ్ సెట్లో టైం దొరికితే చాలు తన బాయ్ ఫ్రెండ్ తో మాట్లాడేది. అలా చాలామంది నాతోనే మాట్లాడేది అని అనుకున్నారు. కానీ అందులో ఎలాంటి నిజం లేదు. నదియా శిరీష్ ని ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత ఈ రూమర్లు ఆగిపోయాయి. కానీ నదియాతో నాకు ఎఫైర్ ఉంది అంటూ వచ్చిన వార్తల్లో నిజం లేదు అంటూ నటుడు సురేష్ ఆ వార్తలను కొట్టి పారేశారు. ఇక గతంలో సురేష్ నదియాల మధ్య ప్రేమాయణం పెళ్ళి వరకు వెళ్లినట్టు ఎన్నో రూమర్లు వినిపించాయి. ఇక ఈ రూమర్లన్నింటికీ సురేష్ వ్యాఖ్యలతో తెరపడినట్లు అయింది