అమలాపాల్ దృష్టి ఎప్పుడూ దానిపైనే...!

K Prakesh
కేరళ కుట్టి అమలాపాల్ ప్రస్తుతం దక్షిణాది సినిమాలలో క్రేజీ హీరోయిన్. మన టాలీవుడ్ లో కూడా పాపులర్ యంగ్ హీరోలు అయిన రామ్ చరణ్, అల్లు అర్జున్ లతో పాటు ఇంక చాలామంది యువ హీరోలతో ఈమె నటించింది. ఈమెకు బన్నీ తో నటించిన ‘ఇద్దరమ్మాయిలతో..’ సినిమాతో నటిగా మంచి పేరుకూడా వచ్చింది. అంతేకాదు ఈమెకు ప్రస్తుతం తెలుగు, తమిళ భాషలలో చేతినిండా సినిమాలు ఉన్నాయి.

గౌతమి మీనన్ లాంటి పప్రముఖ దర్శకుల దృష్టి కూడా ఈమెపై పడింది. ఆమె చేస్తున్న సినిమాలు ఎక్కువగా ఉండడంతో అమల తరచూ అవుట్ డోర్ షూటింగ్ లకు వెళ్ళాల్సి వస్తోంది. దీనివల్ల ఈమె తన ‘మైనా’ ను మిస్ అవుతున్నానని చాలా ఇంటర్వ్యూ లలో చెపుతోంది. ఇంతకీ ఆమైనా ఎవరు అనుకుంటున్నారా...? అమల అత్యంత ప్రేమగా పెంచుకొనే కుక్క పిల్ల పేరు మైనా అట. భారతదేశంలో ఎక్కడ అమలాపాల్ షూటింగ్స్ జరిగినా అమల తో పాటు ఈ మైనా ఉండవలసిందే. కాని విదేశాలకు వెళ్ళే షూటింగ్ లతోనే సమస్య వస్తోంది అట. పాపం అమల మైనాను తన కూడా విదేశాలు చూపించడానికి తీసుకువేళ్ళలేక పోతున్నాను అని బాధపడుతోంది. అందుకే విదేశాలలో షూటింగ్ పూర్తి చేసుకొని ఇంటికి తిరిగి వచ్చిన వెంటనే అమల కళ్ళు వెతికేది ఈ మైనా కోసమేనట.

బడా హీరోయిన్స్ ను బుక్ చేసుకున్న నిర్మాతలకు ఆమెతో పాటు ఆమె పరివారాన్ని కూడా పోషించాల్సిన పరిస్థితి ప్రస్తుతం సినిమా పరిశ్రమలో ఉంది. అమలాపాల్ కు అయితే మాత్రం ఆమె పరివారంతో పాటుగా కుక్క పిల్ల మైనా కూడా బోనస్ గా నిర్మాతల చేత డబ్బులు ఖర్చు పెట్టిస్తుంది. ఎంతైనా క్రేజీ హీరోయిన్ కాబట్టి ఆమాత్రం ఖర్చు మన నిర్మాతలకు ఉండాలి కదా.   

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: